Horoscope Today: ఈ రాశి ప్రేమికులకు కలిసొస్తుంది… ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు…
గమనిక: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తిస్థాయి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
2021 ఆగస్టు 16 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మీ పనులు చాలా వరకు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో బదిలీ లేదా ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
వృషభం
మీకు బాగా కలిసొచ్చే రోజు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త వార్తలు వింటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిస్క్ తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
మిథునం
కుటుంబానికి సంబంధించి కొంత ఆందోళన ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. రుణాలు ఇవ్వొద్దు తీసుకోవద్దు. పనిలో కొన్ని అడ్డంకులు ఉంటాయి... ఈ రోజు ఒత్తిడికి గురవుతారు. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది.
Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు
Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….
కర్కాటక రాశి
ఈ రోజు కాస్త భారంగా గడుస్తుంది. చాలా ఇబ్బందుల తరువాత అప్పులిచ్చిన మొత్తం వసూలవుతుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
సింహం
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్దతు ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. ప్రయాణాలకు అనుకూల సమయం. స్నేహితుడిని, బంధువులను కలుస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారులకు శుభసమయం.
కన్య
ప్రేమలో మరో అడుగు ముందుకేసేందుకు అనుకూల సమయం ఇది. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఇంట్లో వృద్ధుల ఆరోగ్యం బాగుంటుంది. తెలియని వ్యక్తులతో అనవసర చర్చలు వద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.
Also Read: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…
Also Read: Astrology Tips: ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు
తులారాశి
ఈరోజంతా సంతోషంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు అనకూల సమయం. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. భూమి లేదా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.
వృశ్చికరాశి
ఈరోజు మీ పనిలో కొంత అడ్డంకి ఉండొచ్చు. కొత్త వారిని నమ్మవద్దు. ఒత్తిడికి లోనవుతారు. అనవసర వివాదాలు వద్దు. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. దుర్వార్తలు వినే సూచన ఉంది..
ధనుస్సు
ఈరోజు బాగానే ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు. చట్టపరమైన విషయాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబంలో వివాదాలుండే సూచన. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. స్నేహితుడి నుంచి సహాయం అందుకుంటారు.
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
మకరం
మీ రోజు సంతోషంగా గడుస్తుంది. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారవేత్తలు విజయం సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు. సామాజిక రంగానికి సంబంధించిన వ్యక్తులు విజయం సాధిస్తారు. మీరు మంచి సమాచారాన్ని పొందవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు.
కుంభం
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజు. విద్యార్థులు మరింత కష్టపడాలి. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు. పనికిరాని పనులకు సమయం వృధా చేయవద్దు. ఖర్చులను నియంత్రించగలుగుతారు.
మీనం
అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు,వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ఇంటా-బయటా ఒత్తిడిలు తగ్గుతాయి. అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపకండి..ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు...
Also Read: ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…
Also Read: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!