Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
BGT Series: ఈనెల 26న బాక్సింగ్ డే సందర్భంగా మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు ప్రారంభమవుతుంది. చెరో టెస్టు గెలవడంతో ఈ సిరీస్ ఇప్పటికే 1-1తో సమంగా ఉంది.
BGT Series: ఈనెల 26న బాక్సింగ్ డే సందర్భంగా మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు ప్రారంభమవుతుంది. చెరో టెస్టు గెలవడంతో ఈ సిరీస్ ఇప్పటికే 1-1తో సమంగా ఉంది. Melbourne Test: భారత్ ఆస్ట్రేలియా జట్ట మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సగానికి కంటే ఎక్కువగా పూర్తయ్యింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరగగా, తొలి టెస్టును భారత్ కైవసం చేసుకోగా, రెండో టెస్టును కంగారూలు దక్కించుకున్నారు. ఇక వర్షం అంతరాయం వల్ల మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈనెల 26న మెల్ బోర్న్ లో నాలుగో టెస్టు, వచ్చేనెల 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు ప్రారంభమవుతుంది. అయితే ఈ సిరీస్ లో భారత స్టార్ల ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం..
అదరగొట్టిన బుమ్రా..
అంచనాలకు తగ్గట్లుగానే ఈ సిరీస్ కొనసాగుతోంది. సిరీస్ లో ఎక్కువ సెషన్లలో ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, భారత్ తరపున కొన్ని సానుకూల అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన వాడిని చూపించాడు. అన్ ప్లేయబుల్ డెలీవరిలతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టాడు. 21 వికెట్లు సాధించి సిరీస్ లోనే అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. ఈ సిరీస్ మొత్తం బుమ్రా వర్సెస్ ఆసీస్ అని నడిచిందంటే అతిశయోక్తి కాదు. అలాగే పెర్త్ టెస్టులో సారథిగాను వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక, ఓపెనర్ గా రాహుల్ బాగా కుదురుకున్నాడు. సిరీస్ లో 235 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. నిజానికి సిరీస్ లో ఆడిన నలుగురు ఓపెనర్లలో రాహులే మంచి టఛ్ లో కనిపించాడు. ఈ సిరీస్ కు ముందు జట్టులో స్థానం కూడా కోల్పోయిన దశ నుంచి ఓపెనర్ గా తన స్థానాన్ని ప్రస్తుతం పటిష్టపర్చుకున్నాడు. పెర్త్ లో 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడగా, బ్రిస్బేన్ లో 84 పరుగులతో తన విలువేంటో చాటాడు.
కోహ్లీ, విరాట్ ప్లాఫ్ షో..
సిరీస్ లో భారత్ ను అత్యంత కలవరపరిచే అంశం ఏదైనా ఉందంటే అది సినీయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైఫల్యాలే. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమించలేక ప్రత్యర్థులక వికెట్లు సమర్పించుకుంటున్నాడు కోహ్లీ. పెర్త్ లో అజేయ సెంచరీ చేసిన తర్వాత ఆ స్థాయికి దరిదాపుగా తను రాణించలేక పోయాడు. నిజానికి 2020 నుంచే టెస్టుల్లో తన ఆటతీరు అంతంత మాత్రంగా ఉంటోంది. వీలైనంత త్వరగా తను గాడిన పడకపోతే జట్టుకు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ పై పడుతున్న బంతులను తను జాగ్రత్తగా ఆడాలి.
మరోవైపు సారథిగా ముందుండి నడిపించాల్సిన రోహిత్ శర్మ ఈ సిరీస్ లో అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులాడి కేవలం 19 పరుగులే చేశాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే రోహిత్.. ఈ సిరీస్ లో మాత్రం క్లూ లెస్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగడం తనకు కలిసి రానట్లుగా ఉంది. అయితే జట్టు ప్రయోజనాల రిత్యా తన స్థానాన్ని త్యాగం చేసినా, పరుగులు కూడా సాధించి జట్టుకు ఉపయోగపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో జాగ్రత్తగా ఉండి, మెరుగైన ఫుట్ వర్క్, కాస్త టెక్నిక్ ను సరిచేసుకంటే సిరీస్ లో హిట్ మ్యాన్ పరుగుల వరదను చూడొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఇద్దరు స్టార్లు గాడిన పడితే రాబోయే రెండు టెస్టులో భారత్ కు తిరుగుండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: Viral Video: లేడీ జహీర్ ను పరిచయం చేసిన సచిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బౌలింగ్ వీడియో