News
News
X

Monthly Zodiac, August 2021: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….

నమ్మకంతో కొందరు..సరదాగా కొందరు..కారణం ఏదైతేనేం..రాశిఫలాలు చూడడం చాలామందికి అలవాటు. అలాంటి వారికోసం నిత్యఫలాలు, వారఫలాలు, నెలవారీ రాశిఫలాలు అందిస్తోంది మీ ఏబీపీ దేశం.

FOLLOW US: 
 

ఆగస్టు నెలలో రాశిఫలాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి...ఎవరు జాగ్రత్తగా వ్యవహరించాలి...ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉందో చూద్దాం....


మేషం

మేషరాశివారికి గురుబలం వల్ల  ఈ నెల  పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. అన్ని రంగాలవారికి చేయు వృత్తి వ్యాపారాల యందు లాభించును. ఆర్థిక పరిస్థితిలు బాగుంటాయి. దీర్ఘ కాలిక వ్యాధులున్నవారికి ఉపశమనం కలుగుతుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకువెళతారు. మీ మాటకి ఎదురుఉండదు. బుద్ధి స్థిమితంగా ఉండదు.

వృషభం

ఈ నెలలో అనుకున్నది అనుకున్నట్టు చేయగలరు. ఎంతటివారినైనా వశం చేసుకుంటారు. ఆదాయానికి లోటుండదు. చేయు వృత్తివ్యాపారాలయందు రాణిస్తారు. గతంలో ఉన్న సమస్యలు మబ్బవీడినట్టు వీడిపోతాయి. సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు. కుటుంబం సుఖంగా ఉంటుంది. ప్రయాణాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

మిధునం

మిధున రాశివారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సరైన సమయానికి ధనం చేతికందుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలున్న వారికి విజయం వరిస్తుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మనసులో ఉన్న భయాందోళనలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

News Reels

కర్కాటకం

ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం లాభిస్తంది. అన్నిరంగాల వారకీ యోగమే. వృత్తి వ్యాపారాల్లో లాభం. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయానికి లోటుండదు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటారు. వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, శత్రువులపై జయం….భార్యా-భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చెడ్డ మిత్రుల సావాసం వల్ల నీఛపు ఆలోచనలు కలుగుతాయి.


సింహం

ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నిటిలో జయం…కొన్నటిలో అపజయం. ఆర్థిక పరిస్థితులు పర్వాలేదనిపిస్తాయి. అవసరానికి ధనం చేతికందుతుంది. ఆరోగ్య భంగాలు తప్పవు. చిన్న చిన్న శారీరక గాయాలు కలుగుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సంతానానికి ఆరోగ్య సమస్యలు తప్పవు.

కన్య

ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేదు. చేయు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలున్నాయి. ఆదాయానికి ఇబ్బందులు పడతారు. ఆరోగ్య భంగం, వాహన ప్రమాదం ఉంటుంది. శారీరక గాయాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి, ప్రతి చిన్న విషయానికి కలవర పడతారు. ఆందోళన చెందుతారు. భార్య-భర్త మధ్య సరైన అవగాహన ఉండదు. షేర్ల వలన లాభం వస్తుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల

ఈ నెలలో మహోన్నతంగా ఉంటుంది. గ్రహసంచారం చాలా బావుంటుంది. మీ మాటకి ఎదురుండదు. ఎటువంటి పనైనా సాధిస్తారు. ఆదాయం బావుంటుంది. ఆరోగ్య బాగానే ఉంటుంది. నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సౌఖ్యం. స్త్రీ సౌఖ్యం ఉంటుంది.

వృశ్చికం

ఈ నెలలో వృశ్చిక రాశివారి  మాటకి ఎదురుండదు. ఎంతటి వారితో అయినా నేర్పుగా మాట్లాడగలరు. వృత్తి-వ్యాపారాల్లో అభివద్ధి ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. సంతానం వల్ల సంతోషంగా ఉంటారు. భార్య-భర్తల మధ్య అవగాహన బావుంటుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మాసాంతంలో ధనలాభం ఉంటుంది.


ధనస్సు

ఈనెలలో చేయు వృత్తి వ్యాపారల్లో అన్ని రంగాల వారికీ బావుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. జీవనం సాఫీగా ముందుకు సాగుతుంది. వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటారు.

మకరం

మకరరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో వ్యతిరేకత, చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించవు. వ్యవహార భంగాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కావాల్సిన వారే అవమానాలకు గురిచేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత విద్యలలో పరిశోధనలు చేసేవారికి సానుకూల ఫలితాలుంటాయి. నూతన ఆవిష్కరణలు సత్ఫలితాలనిస్తాయి

కుంభం

ఈనెలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. చేయు వృత్తి వ్యాపారాల్లో అడుగు ముందుకు పడదు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. ప్రతి ఒక్కరితో మాటా మాటా పట్టింపులు ఉంటాయి. భార్యతో విరోధాలుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి.

మీనం

ఈనెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహనలాభం, ఆరోగ్య సౌఖ్యం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు.విందులు వినోదాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల్లో జయం కలుగుతుంది.  

Published at : 01 Aug 2021 03:39 AM (IST) Tags: predictions Pisces Monthly Horoscope August 2021 Aires Capricorn zodiac signs important days

సంబంధిత కథనాలు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Horoscope Today 5th December 2022: ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Horoscope Today 5th  December 2022:  ఈ రాశివారికి 'మూడ్ స్వింగ్స్''ఉంటాయి, డిసెంబరు 5 రాశిఫలాలు

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022:  ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022:  ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే  మార్గదర్శి

టాప్ స్టోరీస్

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !