అన్వేషించండి

Horoscope Today Dec 26th, 2023: ఈ రాశివారి ఊహలు నిజమయ్యే సమయం దగ్గర పడింది, డిసెంబరు 26 రాశిఫలాలు

 Daily Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today December 26th, 2023 ( డిసెంబరు 26 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సమయం తీసుకోండి.  ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. సహనంతో ఉండాలి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. తలపెట్టిన పనులకు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. విద్యా పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంబంధాలలో ప్రేమ మాధుర్యాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేయండి. మీ భాగస్వామి ఆందోళన, ఆవేదన  వినేందుకు సమయం కేటాయంచడం మంచిది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీరు ఆర్థిక సంబంధిత విషయాలపై శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా ఉంచుకోవడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ ప్రియమైనవారికి సమయం కేటాయించాలి. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పని పరిధిలో మార్పు ఉండవచ్చు. అనవసర విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించడానికి సమయాన్ని వెచ్చించుకోవాలి. కొత్త వ్యాపార అవకాశాల కోసం వెతుక్కోవాలి. నూతన సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ వ్యూహాత్మక సామర్థ్యాలను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త  వింటారు. సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలను ఎదుర్కొంటారు. సానుకూల అంశాలపై శ్రద్ధ పెట్టండి. 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీరు మీ వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ సంబంధాలను బలంగా ఉంచుకోవడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి . క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసు ఏదో విషయంలో బాధపడుతుంది. ఉద్యోగ స్థలంలో మార్పు ఉండవచ్చు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ సంబంధం క్షీణించనివ్వవద్దు. మీ ప్రేమ జీవితంలో జరుగుతున్న అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి. 

Also Read:  2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయగలరు. సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి. వివాహిత వ్యక్తుల బంధం స్థిరపడుతుంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. మనసు సంతోషంగా ఉంటుంది, అయితే ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. ఏదైనా ఆస్తి ఆదాయ వనరుగా మారవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వివాహేతల సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

లావాదేవీలను జాగ్రత్తగా చేయండి. కార్యాలయంలో పని విషయంలో చాలా శ్రద్ధ చూపించాలి  అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ప్రయాణం చేయవచ్చు. ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.అధిక కోపాన్ని నివారించండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది. సంబంధాలలో అహంభావానికి చోటివ్వకూడదు. 

తులా రాశి (Libra Horoscope Today) 

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయవద్దు.  మీరు భవిష్యత్తు గురించి టెన్షన్ పడతారు. అయితే చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. రిలేషన్ షిప్ లో ఉన్నవారు తొందరపడకూడదు. మీ భావాలను నిజాయితీగా పంచుకోండి. 

Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ధ్యాన వ్యాయామాలు మరియు యోగా చేయడం వల్ల మీ మనస్సు మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మాటలో మాధుర్యం ఉంటుంది కానీ మనసు మాత్రం కలత చెందుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులకు గుడ్ టైమ్. అనవసర చింతలతో మనసు పాడుచేసుకోవద్దు. మీ ఊహలు నిజమయ్యే సమయం దగ్గరపడింది. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీరు వ్యాపార రంగంలో విజయాన్ని పొందవచ్చు.  వ్యాపారం వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని గమనించి, మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.  మనసు ఆనందంగా ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీ ఉద్యోగంలో అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. పురోగతికి అవకాశాలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది.  సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు మీరు మీ కార్యాలయంలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి.  మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సహనాన్ని కొనసాగించండి.  కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ భాగస్వామికి అవసరం అయిన సమయం కేటాయించాలి. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

స్నేహితులు , కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. సంభాషణలో జాగ్రత్త. వ్యాపారంలో  లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీకు దగ్గరైన వ్యక్తులతో మనసులో భావాలు పంచుకోవడం వల్ల కొంత తేలికగా ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మీన రాశి (Pisces Horoscope Today) 

 మీ కుటుంబ సంబంధాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. తగిన విశ్రాంతి తీసుకోవాలి. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. మీరు చేసే పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీరు సంబంధాలలో అభద్రతా భావాన్ని ఫీలవుతారు. మీ భాగస్వామి స్వభావంలో మార్పు గమనిస్తారు. మీ జీవితంలో జరిగే సంఘటనలు కొన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 సింహ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget