Shani Dev 2024: 2024 లో ఈ రాశులవారికి శని యోగకారకుడు, అదృష్టం-లక్ష్మీకటాక్షం!
New Year Prediction 2024: 2024లో ఏ రాశి వారిపై శని అనుగ్రహం ఉంటుంది? ఏ రాశులవారికి కలిసొస్తుంది...శని యోగకారకుడిగా మారుతాడో ఇక్కడ తెలుసుకోండి..
Shani Dev 2024 : 2023 లో కుంభరాశిలో సంచరించిన శని...జూన్ నుంచి తిరోగమనం చెంది నవంబరుతో మళ్లీ కుంభరాశిలో యధావిధిగా సంచరిస్తున్నాడు. ఈ ప్రభావం మేషం నుంచి మీన రాశివరకూ 12 రాశులపైనా ఉంది. శని సంచారం కొన్ని రాశులవారికి మంచి చేస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలనిస్తుంది. గ్రహం వల్ల జరిగే నష్టాలు తెలిసినా తెలియకపోయినా కానీ శనిగ్రహం అంటే మాత్రం భయపడతారంతా. ఏలినాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని....శని మూడు రకాలుగా ఇబ్బంది పెడుతుంది. శని వెంటాడుతున్న సమయంలో కాలేయ సంబంధిత రోగాలు, మనో వ్యధ, నరాల బలహీనత ఉంటుంది. శని బాధల నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ.. శివుడిని, ఆంజనేయుడిని, శనిని పూజిస్తే కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అయితే 2024 ఆరంభంలో శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ప్రభావంతో నాలుగు రాశులవారికి శుభఫలితాలున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూడొచ్చు..
Also Read: 2024 లో ఈ 6 రాశులవారి దశ తిరిగిపోతుంది, కష్టాలు తీరిపోతాయ్!
వృషభ రాశి (Taurus Horoscope 2024) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
2024లో శని తన సొంత రాశి కుంభంలో సంచరించడం వృషభ రాశివారికి మంచి జరుగుతుంది. శని సంచారం వీరికి అన్నీ సత్ఫలితాలనిస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూల ఫలితాలున్నాయి.
మిథున రాశి (Gemini Horoscope 2024) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
శని సంచారం మిథున రాశివారికి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి అధిపతి బుధుడు. బధుడు-శని మధ్య ఉండే స్నేహం కారణంగా మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా బలపడతారు. అనుకున్నవి నేరవేరుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా అందుకుంటారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది.
Also Read: 2024లో ఈ రాశులవారు జాగ్రత్త, శనిగ్రహంతో ఇబ్బందులు తప్పవు
ధనుస్సు రాశి (Sagittarius Horoscope 2024) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
2024లో శని ఈ రాశివారిపై దయ చూపబోతున్నాడు. మీరు మీ కెరీర్‌లో గొప్ప విజయాలు సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. ఆనందంగా ఉంటారు. ధనస్సు రాశివారు 2024 లో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.
మకర రాశి (Capricorn Horoscope 2024) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
2024 సంవత్సరం మకర రాశివారికి శుభఫలితాలున్నాయి. ఈ ఏడాది శని సహకారం ఈ రాశివారికి ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడుతుంది.
కుంభ రాశి (Aquarius Horoscope 2024) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
మీ రాశిలోనే శని సంచరిస్తున్నాడు. అయినప్పటికీ కుంభ రాశివారికి సానుకూల ఫలితాలుంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నవన్నీ నెరవేరుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 వృషభ రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి