2024 లో ఈ రాశులవారిపై శని ప్రభావం 2024 లో శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే రాశులివే... 2024వ సంవత్సరం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా శని సంచారం వల్ల ఇబ్బందులు తప్పవు. కెరీర్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. శని సంచారం వల్ల మిథునరాశివారికి కొత్త ఏడాదిలో ఆర్థిక సమస్యలు తప్పవు. బ ఏడాది ఆరంభంలో మీ జీవిత భాగస్వామితో బంధం క్షీణించవచ్చు. 2024 సంవత్సరంలో సింహ రాశి వారికి చేపట్టిన పనుల్లో అడ్డంకులు తప్పవు. ఈ సంవత్సరం అంతా రాహువు మహాదశను ఎదుర్కోవలసి రావచ్చు. 2024 సంవత్సరంలో, కన్యా రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారికి శని స్థానం భారంగా ఉండబోతోంది. మీన రాశి వారికి 2024 సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పువు. అయితే శనిదోషం ఉన్నప్పటికీ శుక్రుడు, బృహస్పతి సంచారం బావుంటే...శని ప్రభావం తీవ్రంగా ఉండదు. నిత్యం నవగ్రహశ్లోకం చదువుకోవడం, శనివారం శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయుడు -పరమేశ్వరుడిని పూజించడం ద్వారా శని బాధల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది Image Credit: Pixabay