కార్తీకమాసం ముగింపు - దీపదానం చేశారా!



కార్తీకమాసంలో దీపం వెలిగించడానికి ఎంత ప్రాధాన్యత ఉందో..దీపదానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.



దీపదానం అంటే వెండి,బంగారం, ఇత్తడి, ఉసరికాయ, పిండి, సాలగ్రామంతో ఇలా రకరకాలుగా ఇస్తారు.



బియ్యపు పిండితోగానీ, గోధుమ పిండితో గానీ ప్రమిదను తయారుచేసి, అందులో ఆవునేతిని పోసి, వత్తులను వేసి వెలిగించి ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.



ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, సకల సంపదలు, దీర్ఘాయుష్షు లభిస్తుంది.



దీపం దానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం
సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం |
దీపదానం ప్రదాస్యామి శాంతి రస్తు సదా మమ ||



సర్వ జ్ఞాన స్వరూపమైన , సర్వ సంపదలు, ఐహిక సుఖములు కలిగించే ఈ దీపమును నేను దానం ఇస్తున్నాను. దీని వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక అని శ్లోకం అర్థం



కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈమాసంలో దీపారాధన, దీపదానానికి ప్రాధాన్యత ఉంది.



మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది.



నేను అహంకారం తొలగి భగవంతుడే సర్వజ్ఞుడు అనే భావన వస్తే వారి జీవితం వెలుగులమయం అవుతుంది. ఈ భావన కలగడానికే దీపదానం చేస్తారు.



Image Credit: Pinterest