పరమేశ్వరుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో తెలుసా!



బ్రతికి ఉన్నన్నాళ్లూ డబ్బు, బంధాలు, సరాదాలు, స్నేహితులు అంటూ ఇంత జీవితం చూస్తే...



ప్రాణం పోయాక తాడుతో కట్టేసి కట్టెలపై పడుకోబెట్టి ఇంధనం పోసి అగ్నిహోత్రం వెలిగిస్తే



తల నుంచి కాలుతూ వచ్చి కపాలమోక్షం అయ్యాక అరికాళ్లలోంచి నెత్తుటి ముద్దలు వస్తుంటే...



పెద్ద కర్ర పట్టుకుని నెత్తుటి ముద్దల్లా ఉన్న కాళ్లను మంటల్లోకి తోస్తే...



నా వళ్లు నా వళ్లు అని మురిసిపోయిన వారు కట్టెలలో కాలుతూ ఉంటే...



వచ్చినవాళ్లంతా చీకటి పడిపోతోందని స్నానం చేసి వెళ్లిపోతుంటే..



జీవుడు పైకి లేచి ఒక్కడినే ఉండిపోయాని బెంగపెట్టుకుంటాడు...



ఆ సమయంలో ఆ జీవుడిని ఓదార్చేందుకు నేను శ్మశానంలో ఉన్నాను పార్వతీ అని చెప్పాడు శివుడు



Image Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

శివుడు ఏం చేస్తే అనుగ్రహిస్తాడు!

View next story