క్రీస్తు ప్రభువు పుట్టిన రోజే క్రిస్మస్. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో దైవప్రార్థనలు మిన్నంటుతాయి
ఈ సందర్భంగా చేసే దాన ధర్మాలు ప్రభువు కృపకు మిమ్మల్ని పాత్రుల్ని చేస్తాయంటారు మత పెద్దలు
నిస్వార్థంగా ఎవరైతే దేవునికి సేవ చేస్తారో వారికి ఏసుక్రీస్తు ఆశీస్సులు లభిస్తాయి. మీరు చేసే దానం ఇతరులు చూడాలని కానీ ఇతరులు మెచ్చుకోవాలని కానీ ఉండకూడదు
ఇతరులకు తెలిసే విధంగా అస్సలు దానం చేయకూడదు. అలా చేసిన దానం మీకు ఫలితాన్నివ్వదు.
దానం చేస్తున్నప్పుడు ఎవ్వరి నుంచి ప్రశంసలు కోరుకూకూడదు.
నువ్వు చేసే దానం నీ అంతరాత్మకు తెలిస్తే చాలు. అంటే నీ కుడిచేయి దానం చేస్తోంది. ఆ సంగతి ఎడమ చేతికి కూడా తెలియకూడదు.
ప్రార్థన కోసం చర్చిలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నువ్వున్న ప్రదేశంలోనే నిశ్చలభక్తితో ప్రభువును ప్రార్థిస్తే చాలు.
శాంటా అంటే భగవంతుడి స్వరూపంగా భావిస్తారంతా. పైగా చేసేదానం భగవంతుడికే చెందాలి మీకు కాదు.
ఈ పవిత్రమైన రోజు పేదలకు, నిస్సహాయులకు మీ సామర్థ్యం మేరకు వస్త్రాలు, ఆహారం, ఆర్థిక పరంగా మీకు తోచిన సహాయం చేయండి.
రహస్య దానం మీ మనసుకి ఆనందాన్నిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసేదానం మీరు ఊహించనంత మంచి ఫలం ఇస్తుంది. Images Credit: Pixabay