Horoscope Today 14 October 2024 : అక్టోబరు 14 రాశిఫలాలు - ఈ రాశులవారు సమయాన్ని వృధా చేయడంలో నిష్ణాతులు!
Dussehra Horoscope 14th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 14th October 2024
మేష రాశి
ఈ రోజు మీరు ఆలోచనాత్మకంగా పనిచేయాల్సిన రోజు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పురోగతిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు మానసిక , మేధో భారం నుంచి ఉపశమనం పొందుతారు. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దానిని తిరిగి పొందవచ్చు. జీవిత భాగస్వామి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీరు సహనంతో ఉండవలసిన రోజు. వ్యాపారం చేసే వ్యక్తులు ఏ పనీ చిన్నదనీ, పెద్దదనీ భావించకూడదు. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను తొలగించుకుని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ ఆస్తి విషయంలో మీ సోదరుడితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు తమ అధ్యయనాలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వినవచ్చు
మిథున రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. కార్యాలయంలో కష్టపడి పని చేస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. చాలాకాలం తర్వాత పాత స్నేహితుడిని కలిసే అవకాశం మీకు లభిస్తుంది. స్నేహితులకు మీరిచ్చే సలహాలు సూచనలు ఉపయోగపడతాయి.
Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!
కర్కాటక రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. శారీరక సమస్యలపై కొంత శ్రద్ధ వహించాలి. పనికిరాని వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయించడం తగ్గించాలి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.
సింహ రాశి
ఈ రోజు మీరు బాధ్యతాయుతంగా పని చేసే రోజు. అనుకోని ఆర్థికలాభం ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల్లో అలసత్వం కారణంగా మళ్లీ పరీక్షకు హాజరు కావాల్సి రావచ్చు. కొన్ని కొత్త పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు తమ పనిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా బ్యాంకు, వ్యక్తి, సంస్థ నుంచి డబ్బును అప్పుగా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే దానిని పొందడం సులభం అవుతుంది
కన్యా రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటే, అది కూడా పూర్తిచేస్తారు. ఇంటికి అతిథి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు తమ యజమానితో ఎలాంటి వివాదాలకు దిగకుండా ఉండడం మంచిది.
తులా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికపరంగా గతంలో నష్టపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం,వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!
వృశ్చిక రాశి
ఏదో విషయంపై మీ మనసులో అనవసరమైన ఒత్తిడి ఉంటుంది. మీరు ప్రభుత్వ పథకాల నుంచి పూర్తి ప్రయోజనాలను పొందుతారు. మీరు వ్యాపార ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజు కుటుంబ సమస్యలు పెరగవచ్చు. నూతన పెట్టుబడి పెట్టే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించాల్సిన అవసరం ఉంది.
ధనస్సు రాశి
మీ వ్యాపార ప్రణాళికల ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది.. డబ్బు ఆదా చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగంలో పని చేసే వ్యక్తులు తమ పనిని తాము చేసుకుపోవడమే మంచిది. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనకు దూరంగా ఉండాలి.
మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఓపిక పట్టాలి. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే రానున్న రోజుల్లో అది మరింత పెరిగే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్ లో ఉన్న డీల్ ఖరారు అయినట్టే అనిపించినా ఆఖరి నిముషంలో మీ టెన్షన్ పెంచుతుంది.
lso Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!
కుంభ రాశి
ఈ రోజు మీరు దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ అసంపూర్ణ పని పూర్తయినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. కొత్త శత్రువులు ఏర్పడతారు..మీ తెలివితేటలతో సమాధానం చెబుతారు. మీ ఆనందం కోసం ఖర్చులు అధికంగా పెడతారు. గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు బహిర్గతం అవుతాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మాటలు పడాల్సి ఉంటుంది.
మీన రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అప్పులు చేసి ఉంటే దానిని చెల్లించేందుకు సమస్యలు ఎదుర్కోతప్పదు. మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడంలో మీరు విజయం సాధిస్తారు. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.