Weekly Horoscope 14 to 20 october 2024: ఈ రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!
Astrology Predictions : అక్టోబరు 14 సోమవారం నుంచి అక్టోబరు 20 ఆదివారం వరకూ మేషం, వృషభం, కర్కాటకం, కన్యా రాశులవారికి సమయం కలసి రావడం లేదు.. ఈ వారం మీ రాశిఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....
Weekly Horoscope Predictions 14 to 20 october 2024
మేష రాశి ( Aries weekly Horoscope)
మేష రాశి వారికి ఈ వారం అంత అనుకూల ఫలితాలు లేవు. ఆర్థిక ,మానసిక సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఈ వారం మీరు చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వారం ప్రారంభంలో పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. కార్యాలయంలో ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఉన్నత ఉద్యోగుల నుంచి కావాల్సిన సహకారం లభించదు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో తగాదాలు జరిగే సూచనలున్నాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. హనుమంతుడిని పూజించండి
వృషభ రాశి ( Taurus weekly Horoscope)
వృషభ రాశి వారు ఈ వారం చేసే శ్రమ, ప్రయత్నాలతో పోలిస్తే తక్కువ ఫలితాలు రావచ్చు. ప్రణాళికాబద్ధమైన పనులను పూర్తి చేయడానికి మీరు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సి రావచ్చు. వారం ప్రారంభంలో ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశాలలో వృత్తి , వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఆశించిన విజయాన్ని పొందడానికి ఇంకొంతకాలం ఆగాల్సిందే. నూతన పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేసేఆలోచన చేయవద్దు. మాటలో స్పష్టత, మర్యాద అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈవారం దుర్గా చాలీసా పఠించడం మంచిది.
Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!
కర్కాటక రాశి ( Cancer weekly Horoscope)
ఈవారం ఈ రాశివారు ఎదుటివారితో వాదనలు కాకుండా తమ లక్ష్యాలపై దృష్టించాలి. కార్యాలయంలో ప్రత్యర్థుల మాయలో చిక్కుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. మీ పనిని మరొకరికి వదిలేయడం ద్వారా తీవ్రంగా నష్టపోతారు. కొంతకాలంగా బాధపడుతున్న సమస్య గురించి ఆందోళన పెరుగుతుంది. మీ శ్రేయోభిలాషుల నుంచి పరిష్కారం లభిస్తుంది. వారం మధ్యలో అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. శరీరంతో పాటూ మనసు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలని గుర్తించండి. స్నేహం, ప్రేమ, వైవాహిక జీవితంలో ఉండే విభేదాలు తొలగించుకునేందుకు ప్రయత్నించండి. రోజూ శివలింగానికి నీరు సమర్పించాలి..
కన్యా రాశి ( Virgo weekly Horoscope)
ఈ వారం కన్యా రాశి వారికి కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. భూమి, భవనాలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు చాలా ఓపిక, విచక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. వారం ప్రారంభంలో ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీపై అదనపు భారం ఉంటుంది. ఈ వారంలో దీర్ఘకాలిక వ్యాధులు లేదా కాలానుగుణ అనారోగ్యం కారణంగా శారీరక నొప్పికి గురవుతారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలో తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. వైవాహిక జీవితంలో సంతోషం ఉండాలంటే భాగస్వామికోసం సమయం కేటాయించాలి. రోజూ నారాయణ కవచం పఠించండి.
Also Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.