అన్వేషించండి

Weekly Horoscope 14 to 20 october 2024: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!

Astrology Predictions : అక్టోబరు 14 సోమవారం నుంచి అక్టోబరు 20 ఆదివారం వరకూ మిథునం, వృశ్చికం, ధనస్సు , కుంభ రాశులవారికి అన్నీ శుభఫలితాలే ఉన్నాయి.. ఈ వారం మీ రాశిఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope Predictions 14 to 20 october 2024


మిథున రాశి ( Gemini weekly Horoscope)

గడిచిన వారంకన్నా ఈ వారం మిథున రాశివారికి మంచి ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. హడావుడి మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.  వారం మధ్యలో అకాస్మాత్తుగా పనిభారం పడుతుంది. అయితే, మీ సహోద్యోగులు, శ్రేయోభిలాషుల సహకారంతో విజయం సాధిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేయవచ్చు...అయితే శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ వినాయకుడికి దూర్వాలు సమర్పించండి. 

Also Read: మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి


వృశ్చిక రాశి ( Scorpio weekly Horoscope)

వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదం. మీ ఆశలు, కలలు నెరవేరుతాయి. వారం మొత్తం మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. వారం ఆరంభంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. మీ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. దూరప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. వారం చివర్లో ఆస్తులకు సంబంధించిన వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు   విజయవంతమవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ సుందరకాండ పఠించండి.

ధనస్సు రాశి ( Sagittarius weekly Horoscope)

ధనుస్సు రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ పురోగతి ఉంటుంది. మీ కృషి, పట్టుదలకు మంచి ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు...వీరి సహాయంలో భవిష్యత్ లో మంచి లాభాలు ఆర్జిస్తారు. వృత్తి, వ్యాపారాల పరంగా ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులు కోరుకున్న సంస్థలలో ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. వారం ద్వితీయార్థంలో కోర్టు సంబంధిత విషయాల్లో విజయం సాధించవచ్చు. ఈ వారం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ మీకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ అరటి చెట్టుకు నీళ్ళు పోసి  విష్ణు సహస్రనామం పఠించండి. 

Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట

కుంభ రాశి ( Aquarius  weekly Horoscope)

ఈ వారం మీకు వృత్తి, వ్యాపారాలకు పూర్తిగా అనుకూల సమయం. ఎప్పటి నుంచో ఉండిపోయిన అసంపూర్ణ పనులను పూర్తి చేయడంపై మీ దృష్టి ఉంటుంది.  ఈ వారం మీ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను చూస్తారు. మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారం ఆ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీపట్ల దయతో ఉంటారు. వారం చివర్లో ముఖ్యమైన బాధ్యత స్వీకరిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి.   మీరు గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. హనుమాన్ చాలీశా పఠించండి. 

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే
Embed widget