అన్వేషించండి

Your Weekly Horoscope 14 to 20 october 2024: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!

Astrology Predictions : అక్టోబరు 14 సోమవారం నుంచి అక్టోబరు 20 ఆదివారం వరకూ సింహ, తులా, మకరం, మీన రాశులవారి శుభాశుబాలు మిశ్రమంగా ఉన్నాయి.. ఈ వారం మీ రాశిఫలితాలు ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope Predictions 14 to 20 october 2024


సింహ రాశి ( Leo weekly Horoscope)

సింహ రాశి వారికి ఈ వారం సమయం అనుకూలిస్తుంది కానీ అత్యుత్సాహంతో ఏం చేసినా మొదటికే మోసపోతారు. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. వారం ఆరంభంలో మీ ప్రియమైనవారితో సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల సమయం...మీ పనిని పూర్తి అంకితభావంతో నిర్వహిస్తారు, ప్రయత్నాలకు పూర్తి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు ఒక ప్రత్యేక వ్యక్తి నుంచి కొత్త పనికి సంబంధించిన సమాచారం పొందుతారు. జర్నలిజం, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్‌లో పనిచేసే వారికి ఈ వారం విశేష విజయం ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రతిరోజూ లక్ష్మీనారాయణుడిని పూజించండి..విష్ణు సహస్రనామం పఠించండి. 

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

తులా రాశి ( Libra weekly Horoscope)

తులా రాశి వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలున్నాయి. వారం ప్రారంభంలో ఇంట్లో సమస్యలు ఇబ్బందిపెడతాయి కానీ వారాంతంలో పరిష్కారం అవుతాయి. వ్యాపారులు చాలా తెలివిగా వ్యవహరిస్తే నష్టాలబారిన పడకుండా ఉంటారు. కొన్ని విషయాల్లో గందరగోళం కొనసాగుతుంది.. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది.  వారాంతంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. వివాహం దిశగా అడుగువేయాలి అనుకుంటే.. మీ మనసులో ఉండే ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వారం మొత్తం రుద్రాష్టకం పఠించండి. 

మకర రాశి (Capricorn weekly Horoscope)

మకర రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వారం ప్రారంభంలో పనిలో వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు కొంచెం బాధపడతారు. భూమి, భవనం లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తిని బాధపెట్టే పనులు చేయకుండా ఉంటే మీకు మనశ్శాంతి లభిస్తుంది. కేవలం మీ మాటతీరు వల్లే ఏళ్లతరబడి ఉన్న బంధాల్లో చీలిక ఏర్పడే ప్రమాదం ఉంది..జాగ్రత్తపడండి. ముఖ్యమైన వ్యాపార సంబంధిత నిర్ణయాలను తొందరపడి తీసుకోవడం మానుకోవాలి. మీ మాటతీరు, ప్రవర్తన మీకు శత్రువుగా మారే సమయం ఇది. వారం ద్వితీయార్థంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. నిత్యం రుద్రాష్టకం పఠించండి.

మీన రాశి  (PIsces weekly Horoscope)

ఈ వారం మీన రాశి వారు అధిక లాభాలపై కన్నా నష్టాలు తగ్గించుకునేందుకు దృష్టి సారించాలి. ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక సంబంధిత విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ వారం అనుకోని ఖర్చులతో పాటూ పెద్ద బాధ్యతను స్వీకరించాల్సి రావొచ్చు. వారం మొత్తం బిజీగా ఉండడంతో వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ వహించలేరు...ఈ సమయంలో మీ ప్రియమైనవారినుంచి అంసతృప్తిని ఎదుర్కోవాల్సి రావొచ్చు.  ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వారం ప్రధమార్థం కన్నా ద్వితీయార్ధం కాస్త రిలాక్స్‌గా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు శుభ ఫలితాలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు.  ప్రేమ వ్యవహారాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తారు. ప్రతిరోజూ  నారాయణ కవచాన్ని పఠించండి.

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Vs Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samsonవిజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Vs Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం - సిరీస్ క్లీన్ స్వీప్
Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Baba Siddique Shot Dead: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ దారుణహత్య, ఇద్దరు నిందితుల అరెస్ట్, పిస్టల్ స్వాధీనం
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?
Proffessor Saibaba: ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
Harihara Veeramallu: స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి - సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి - సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం
Tragedy Incidents: పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
Embed widget