Shani Shukra Samsaptak Yog: శని, శుక్ర సంసప్తక యోగం - ఆగష్టు 25 వరకూ ఈ రాశులవారి జీవితంలో అన్నీ అద్భుతాలే!
Samsaptaka Yogam: శుక్రుడు-శని ఒకేరాశిలో కలిసినప్పుడు శని శుక్ర సంసప్తక యోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. అయితే కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందనున్నారు.
Shani Shukra Samsaptak Yog: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు-శని సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. శనిప్రభావం ఆరోగ్యం, విద్య, ఉద్యోగంపై చూపిస్తే... శుక్రుడు ఐశ్వర్య, విలాసవంతమైన జీవితం, సంబంధాలతో సంతోషానికి కారణకుడు. అందుకే ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉంటే మిగిలిన గ్రహాల సంచారం కొంతవరకూ ప్రతికూలంగా ఉన్నప్పటికీ అంత ప్రభావం ఉండదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. శుక్రుడు - శని ఒకే రాశిలో ఉండడంతో శని శుక్ర సంసప్తక యోగం ఏర్పడుతోంది. శుక్రుడు జూలై 31న సింహరాశిలోకి ప్రవేశించాడు...ఆగష్టు 25 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శని ఇప్పటికే శుక్రుని సప్తమ రాశి అయిన కుంభరాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు - శని కలయిక జూలై 31 నుంచి ఆగష్టు 25 వరకూ ఉంటుంది. శుక్రుడు , శనితో పాటూ ఇతర గ్రహాలు కూడా శుభస్థానంలో ఉంటే...ఈ సమయంలో ఆ జాతకుడి అదృష్టం మామూలుగా ఉండదు. ఈ ప్రభావం 12 రాశులవారిపై ఉంటుంది..ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 2024 శ్రావణమాసంలో శుభముహూర్తాలివే.. ఇప్పుడు కూడా టైమ్ తక్కువే ఉంది త్వరపడండి!
మేష రాశి
ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహణకు ప్లాన్ చేస్తారు. నూతన ఆదాయవనరులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పనితీరు మారుతుంది
వృషభ రాశి
ఆరోగ్యం కోసం అధికంగా ఖర్చుచేయాల్సి వస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఎప్పటినుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి
మిథున రాశి
ఈ సమయంలో మీకు శుభం - అశుభం..రెండూ మిశ్రమంగా ఉంటాయి. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు..ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది
కర్కాటక రాశి
నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు , నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు
సింహ రాశి
కొత్తగా ఏర్పడిన బంధాలలో అస్థిరత ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ కలహాలు.
కన్యా రాశి
ఈ రాశివారికి ఈ నెలరోజులూ అన్నీ శుభాలే. ఆర్థిక లాభాలుంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యవహారాల్లో పాలుపంచుకుంటారు
తులా రాశి
కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఎప్పటి నుంచో నిలిచిన పనుల్లో తిరిగి పురోగతి ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో రాణిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది
Also Read: శ్రావణమాసం మంగళగౌరీ వ్రతం చేస్తున్నారా.. పూజా విధానం ఇదిగో!
వృశ్చిక రాశి
కొత్త భాగస్వామ్యాన్ని అంచనా వేసే పనిలో తప్పుుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. చేపట్టిన పనుల్లో చివరి క్షణంలో ఆటంకాలు తప్పవు.
ధనస్సు రాశి
వివాదాస్పద విషయాలలో మీదే పైచేయి అవుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదో విషయంలో కొంత కలవరపాటు తప్పదు
మకర రాశి
ఆర్థిక పురోగతి ఉంటుంది. ప్రయోజనకరమైన మార్పులొస్తాయి. గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యాలు నిర్వహిస్తారు
కుంభ రాశి
అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం తథ్యం. ప్రయాణాలలో లాభపడతారు. గతంలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు పొందుతారు. ఊహించని ఆర్థిక ప్రయోజనం ఉంటుంది
మీన రాశి
ఈ రాశివారికి కుటుంబంలో వివాదాలు తప్పవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణపనులపై అధిక వ్యయం ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి...
Also Read: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.