అన్వేషించండి
మీన రాశి వారికి 2029 వరకు ఎల్నాటి శని! ప్రతి రోజూ ఇవి పాటించండి శని ప్రభావం తగ్గుతుంది!
Shani Sadesati : మీన రాశిపై ఏప్రిల్ 2029 వరకు ఎల్నాటి శని ప్రభావం ఉంటుంది. శని దోషం నుంచి ఉపశమనం కోసం కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు
Shani Gochar 2025
1/6

శని దేవుడు రెండున్నరేళ్లకు ఓసారి రాశి పరివర్తనం చెందుతాడు. ఆ సమయంలో మూడు రాశులవారిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు శనిదేవుడు
2/6

ఎల్నాటి శని ప్రభావం మూడు దశల్లో ఉంటుంది. ఓ రాశివారిపై ఏడున్నర సంవత్సరాలు ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మీన రాశివారికి జన్మంలో ఉన్నాడు శని
3/6

మార్చి 2025లో శని మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు..మీకు రెండవ దశ ప్రారంభమైంది. 2027లో శని మేష రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీన రాశిపై మూడవ దశ ప్రారంభమవుతుంది. ఇది 2029 వరకు ఉంటుంది. 2029లో శని వృషభంలోకి ప్రవేశించినప్పుడు మీన రాశిపై ఎల్నాటి శని ప్రభావం ముగుస్తుంది
4/6

ప్రస్తుతం మీన రాశిపై శని దశ రెండవ దశ నడుస్తోంది, ఇది శని దశలో అత్యంత బాధాకరమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు , కుటుంబ కలహాలు ఉంటాయి. అందువల్ల మీన రాశి వారు కొన్ని నియమాలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు పండితులు
5/6

ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి. శనివారం నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు లేదా నల్లటి వస్త్రాలను దానం చేయండి. రావి చెట్టుకు నీరు సమర్పించండి. మంగళవారం , శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
6/6

సోమరితనం, అబద్ధాలు చెప్పడం, తోటివారికి అన్యాయం చేయడం, అప్పులు తీసుకోవడం లాంటివి మానేయండి. శని కర్మఫలదాత.. కాబట్టి శని దశ సమయంలో మీ కర్మలే మీకు రక్షణ కవచంగా మారుతాయి. అందుకే కష్టాన్నే నమ్ముకోండి..
Published at : 08 Nov 2025 08:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















