అన్వేషించండి

Mangla Gauri Vrat 2024: శ్రావణమాసం మంగళగౌరీ వ్రతం చేస్తున్నారా.. పూజా విధానం ఇదిగో!

Mangla Gauri Vrat 2024 : శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళ గౌరిని పూజిస్తారు. సౌభాగ్యం, సత్సంతానం ,అన్యోన్యదాంపత్యం కోసం చేసే ఈ మంగళ గౌరీ వ్రత విధానం మీకోసం..

Mangala Gauri Vrat 2024 Puja : శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళ గౌరిని పూజిస్తారు. సౌభాగ్యం, సత్సంతానం ,అన్యోన్యదాంపత్యం కోసం చేసే ఈ మంగళ గౌరీ వ్రత విధానం మీకోసం..
 

ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధిస్తారు. శ్రావణమంగళవారం పూజ ప్రారంభించేముందు కూడా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించి.. ఆ తర్వాత మంగళగౌరిని పూజించాలి. 

పసుపు వినాయకుడి పూజకోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

మంగళగౌరి పూజా విధానం 

పసుపు వినాయకుడి పూజ తర్వాత మంగళగౌరి పూజ ప్రారంభిస్తారు. పూజలో పిండి దీపాలు, తోరాలు పెట్టాలి. పూజ తర్వాత అమ్మవారికి ఓ తోరం కట్టి...మరొకటి పూజ చేసిన వాళ్లు కట్టుకుని...మిగిలినవి ఇంటికి ఆహ్వానించిన ముత్తైదువలకు కట్టాలి.  ముందుకా కాళ్లకుపసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం అద్ది, తోరం కట్టిన తర్వాత పిండి జ్యోతితో పాటూ తాంబూలం ఇవ్వాలి. శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఇదే పద్ధతి అనుసరిస్తారు. మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లపాటూ చేస్తారు. ప్రాంతాన్ని బట్టి పూజా విధానంలో మార్పులు ఉండొచ్చు.  

ధ్యానం
సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం
సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం
అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం
జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం

దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం
బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం
శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి

ఆసనం
కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని
ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె
రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.
 మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాన్/పుష్పం సమర్పయామి.

ఆవాహనం 
ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం
బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం
చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం
తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.

పాద్యం
ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం
పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై
శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం
కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.
 మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం 
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

శుద్దోదక స్నానం
లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన
ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై
గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై
స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.
 మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.

అక్షతలు
హ్రీంకారఅంకిత మంత్రక్షితలతోనో హేమాచాలాత్స చిన్తై
రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం

వస్త్రయుగ్మం
కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై
జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి
ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం
దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.
 మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం/అక్షతాన్/పుష్పం సమర్పయామి.

యజ్ఞోపవీతం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.

ఆభరణం
హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం
హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే
మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం
నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః  ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి.

గంధం
సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం
కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం
కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం
 మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం/అక్షతాన్ సమర్పయామి.

అధాంగ పూజ
వుమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జన్ఘి పూజయామి
పార్వత్యైనమః జానునీ పూజయామి
జగన్మాత్రేనమః ఊరూ పూజయామి
జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి
మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి
అమ్బికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్నాయై నమః స్థ నౌ పూజయామి
శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంభు కంట్యై నమః కంటం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రే పూజయామి
రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి
సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
మంగలగౌర్యై నమః
గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి... (మీకు అందుబాటులో లేకపోతే..ఈ లింక్ క్లిక్ చేయండి..ఇందులో కూడా అధాంగ పూజ తర్వాత అష్టోత్తరం ఉంటుంది)

ధూపం
హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై
రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం
తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ
న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .
 శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి

దీపం 
లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే
మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై
చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై
ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.
 మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి..
(దీపానికి అక్షతలు వేసి నమస్కరించాలి)

నైవేద్యం
హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం
దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా
దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం
మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే
మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి
(మీరు వండిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి)

తాంబూలం 
సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై
ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై
ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై
పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే
 మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం
కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త
పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి
తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం
 మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.

పరాంకుషౌ పాశామభీతి ముద్రం
కరైర్వహన్తీం కమలాసనస్తాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం
భజేహ మంబాం జగదీశ్వరీం తాం.

మంత్రపుష్పం 
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
 మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్ 
హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి
వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే
సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే
సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.
 మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ

యుగాల్లో మొదటిదైన సత్యయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయంలో అమృతం కన్నా ముందు  అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయపడిన దేవతలు, దానవులు ...శివుడిని ఆశ్రయించారు. ఆ సమయంలో పార్వతి వంక చూశాడు శివుడు. బిడ్డలకు ఆపదకలిగినప్పుడు మనంకాకుండా ఎవరు రక్షిస్తారని...ఆ విషాన్ని సేవించమని చెప్పింది అమ్మవారు. తన మాంగల్యం ఎంత బలమైనదో చెప్పకనే చెప్పింది జగన్మాత. అలా మాంగల్యంపై   విశ్వాసంతో,లోకవినాశానికి కారణమైన  భయంకర కాలకూట విషాన్ని భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మంగళగౌరిని శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూజిస్తే సౌభాగ్యం, సంతానం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget