2024 వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది - ఈ వ్రతం ఎందుకు చేయాలి!

రెండో శ్రావణ శుక్రవారం...పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం అయిన ఆగష్టు 16 న వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు స్త్రీలు వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు

శ్రావణశుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం

డబ్బు, భూమి, విజ్ఞానం, సంతోషం, ప్రేమ, కీర్తి, శాంతి, బలం...ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములుగా పూజిస్తారు

ఈ శక్తులన్నీ ఉన్నప్పుడే మనిషి జీవితానికి పరిపూర్ణత చేకూరుతుంది..సంతోషంగా ఉంటారు

సాధారణంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం..శ్రావణంలో వచ్చే శుక్రవారం అత్యంత ప్రీతికరం

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయలేకపోతే ఏం జరుగుతుందో అనే భయం వద్దు..

శ్రావణంలో వచ్చే ఏ శుక్రవారం అయినా వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చని పండితులు సూచిస్తున్నారు

మీ మీ ప్రాంతాలను బట్టి పాటించే పద్ధతులు, అనుసరించే సంప్రదాయాలు వేరైనా...అమ్మవారి ఆరాధనం శుభకరం
Image Credit: playground.com