చాణక్య నీతి: వీళ్ల కన్నా శత్రువులే నయం

మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు శత్రువుల కన్నా ప్రమాదకరం అంటాడు ఆచార్య చాణక్యుడు

ఆ వ్యక్తులు ఎవరో కూడా ఓ శ్లోకం రూపంలో స్పష్టంగా వివరించాడు

నవ పశ్యతి జన్మంధః కమాన్ధః కమంధో నైవ పశ్యతి.
మదోన్మత్త న పశ్యంతి ఆర్తి దోష న పశ్యతి ..

గుడ్డివాడు పుట్టినప్పటి నుంచీ దేనినీ చూడలేనట్లే...కోపం, మత్తులో ఉన్నవారు వాటిని తప్ప మరేం చూడరని ఈ శ్లోకం అర్థం

స్వార్థపరుడు కూడా ఈ కోవకు చెందినవాడే..వారికి తమ ఉపయోగం తప్ప మరో ఆలోచన ఉండదు. సహాయం చేయాలనే తపనా ఉండదు.

దుష్టులు, అత్యాశ పరులు కూడా ఇతరుల పురోగతి చూసి రగిలిపోతుంటారు..

వీరిలో అవసరం, అసూయ, కోరిక మినహా మరో ఆలోచన ఉండదు..చేసే ప్రతి పనిలోనూ వారి ప్రయోజనం చూసుకుంటారు

కొన్ని సందర్భాల్లో తమ అవసరం తీర్చుకునేందుకు ఎదుటివారికి హాని చేసేందుకు కూడా వెనుకాడరు

ఇలాంటివారితో స్నేహం, బంధం రెండూ ప్రమాదకరమే...వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు శత్రువుల కన్నా ప్రమాదకరం
Image Credit: playground.com