దేవుడు ఉన్నాడనే పూజలు చేస్తున్నారా! ఓ విద్యార్థి వినాయకుడికి పూజ చేశాడు..మార్కులు రాలేదు కొన్నాళ్ల తర్వాత శివుడిని పూజించాడు ..మార్కులు రాలేదు ఆ తర్వాత సరస్వతీ దేవిని పూజించాడు..అయినా మార్కులు రాలేదు ఆ ముగ్గురి ఫొటోస్ తీసుకెళ్లి ఓ పక్కన పెట్టేసి..వేంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పెట్టాడు శ్రీ వేంకటేశ్వరుడికి అగరబత్తి వెలిగిస్తే...ఓ మూలన పెట్టిన వినాయకుడు, శివుడు, సరస్వతీ ఫొటోలకు పొగ వ్యాపించింది అది చూసిన ఆ విద్యార్థి..నాకు మార్కులు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తారా అంటూ వాటిని గుడ్డలతో కప్పేసే ప్రయత్నం చేశాడు అప్పుడు ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు.. పూజచేసినప్పుడు రాలేదు కానీ ఇప్పుడొచ్చారు ఎందుకని అడిగాడు పూజ చేసినప్పుడు మేం ఉన్నామని నమ్మలేదు.. పొగ పీల్చేస్తున్నామని భావిస్తున్నావంటే మేం ఉన్నాం అని నమ్మావు కదా అన్నారట భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజించినప్పుడు ఫలితం ఉంటుందని చెప్పడమే దీనివెనుకున్న ఆంతర్యం Image Credit: playground.com