అన్వేషించండి

Mangla Gauri Vrat 2022: సౌభాగ్యం, మంచి సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం చేసే మంగళ గౌరీ వ్రత విధానం

శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళ గౌరీ పూజ చేస్తారు. పూజ అనంతరం ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు. మంగళగౌరి పూజా విధానం మీకోసం

ముందుగా పసుపు వినాయకుడి పూజ చేసిన తర్వాత మంగళగౌరి పూజ ప్రారంభించాలి. పసుపు గణపతి పూజకోసం ఈ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

Also Read: శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ముందుగా పసుపు గణపతి పూజా విధానం

వినాయక పూజ అనంతరం మంగళగౌరి పూజ చేసి..పిండి దీపాలు, తోరాలు పెట్టాలి. పూజ అనంతరం అమ్మవారి కి ఓ తోరం కటిటు, పూజ చేసిన వాళ్లు కట్టుకుని.. ముత్తైదువల కాళ్లకు పసుపు రాసి, ముఖాన బొట్టుపెట్టి, తోరం కట్టి..పిండి జ్యోతి, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. ఇలా శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం.. ఐదేళ్ల పాటు చేయాలి.  సౌభాగ్యం, సత్సంతానం ,అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.

శ్రావణ మంగళ గౌరీ పూజా విధానం

ధ్యానం
సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం
సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం
అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం
జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం.

దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం
బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం
శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి.
ఆసనం
కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని
ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె
రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

ఆవాహనం 
ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం
బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం
చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం
తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.

పాద్యం
ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం
పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై
శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం
కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం 
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

శుద్దోదక స్నానం
లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన
ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై
గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై
స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.

అక్షతలు
హ్రీంకారఅంకిత మంత్రక్షితలతోనో హేమాచాలాత్స చిన్తై
రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం

వస్త్రయుగ్మం
కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై
జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి
ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం
దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.

ఆభరణం
హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం
హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే
మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం
నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న మయా భారనాని సమర్పయామి.

గంధం
సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం
కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం
కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.

అధాంగ పూజ
వుమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జన్ఘి పూజయామి
పార్వత్యైనమః జానునీ పూజయామి
జగన్మాత్రేనమః ఊరూ పూజయామి
జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి
మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి
అమ్బికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్నాయై నమః స్థ నౌ పూజయామి
శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంభు కంట్యై నమః కంటం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రే పూజయామి
రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి
సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
మంగలగౌర్యై నమః

గౌరీ అష్ట్తోత్తర శతనామావళి
ఓం గౌర్యై నమః   ఓం గిరిజాతనుభావాయై నమః ఓం జగన్మాత్రే నమః
ఓం వీరభద్ర ప్రసువే నమః  ఓం విశ్వరూపిన్యై నమః ఓం కష్ట దారిద్రషమన్యై నమః
ఓం శామ్భావ్యై నమః ఓం బాలాయై నమః ఓం భాద్రదాయిన్యై నమః ఓం సర్వ మంగలాయై నమః 
ఓం మహేశ్వర్యై నమః ఓం మంత్రారాధ్యై నమః  ఓం హేమాద్రిజాయై నమః
ఓం పార్వత్యై నమః ఓం నారాయణంశాజాయై నమః ఓం నిరీశాయై నమః  ఓం అమ్బికాయై నమః
ఓం ముని సంసేవ్యాయై నమః  ఓం మేనకాత్మజాయై నమః ఓం కన్యకాయై నమః 
ఓం కలిదోష నివారిన్యై నమః ఓం గణేశ జనన్యై నమః ఓం గుహామ్బికాయై నమః 
ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః  ఓం విశ్వా వ్యాపిన్యై నమః ఓం అష్టమూర్తాత్మికాయై నమః 
ఓం శివాయై నమః ఓం శాంకర్యై నమః ఓం భావాన్యై నమః ఓం మాంగల్య దాయిన్యై నమః
ఓం మంజు భాశిన్యై నమః మహా మాయాయై నమః ఓం మహా బలాయై నమః ఓం హేమవత్యై నమః
ఓం పాప నాశిన్యై నమః ఓం నిత్యాయై నమః ఓం నిర్మలాయై నమః ఓం మ్రుదాన్యై నమః
ఓం మానిన్యై నమః ఓం కుమార్యై నమః ఓం దుర్గాయై నమః ఓం కాత్యాయిన్యై నమః
ఓం కలార్చితాయై నమః  ఓం క్రుపాపూర్నాయై నమః ఓం సర్వమయి నమః ఓం సరస్వత్యై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః ఓం అమ్రుతెశ్వర్యై నమః ఓం సుఖచ్చిత్పుదారాయై నమః 
ఓం బాల్యారాదిత భూతదాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం సూక్ష్మాయై నమః
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః ఓం సర్వ భోగాప్రదాయై నమః  ఓం సామ శిఖరాయై నమః 
ఓం కర్మ బ్రమ్హ్యై నమః ఓం ఓం వాంచితార్ధ యై నమః ఓం చిదంబర శరీరిన్యై నమః ఓం దేవ్యై నమః
ఓం కమలాయై నమః ఓం మార్కందేయవర ప్రదాయి నమః ఓం పున్యాయై నమః ఓం సత్యధర్మరతాయై నమః
ఓం శశాంక రూపిన్యై నమః  ఓం భాగాలాయై నమః ఓం మాత్రుకాయై నమః ఓం శూలిన్యై నమః
ఓం సత్యై నమః ఓం కల్యాన్యై నమః ఓం సౌభాగ్యదాయిన్యై నమః ఓం అమలాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః ఓం అమ్బాయై నమః 
ఓం భానుకోటి సముద్యతాయై నమః ఓం పరాయి నమః ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
ఓం సర్వ కాల సుమంగళ్యై నమః ఓం సామ శిఖరాయై నమః ఓం వేదాంగ లక్షణా యై నమః 
ఓం కామ కలనాయై నమః ఓం చంద్రార్క యుత తాటంకా యై నమః
ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః ఓం కామేశ్వర పత్న్యై నమః ఓం మురారి ప్రియార్దాన్గై నమః 
ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః ఓం పురుషార్ధ ప్రదాయి నమః ఓం సర్వ సాక్షిన్యై నమః
ఓం శ్యామలాయై నమః ఓం చంద్యై నమః ఓం భాగామాలిన్యై నమః ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః ఓం దాక్షాయిన్యై నమః
ఓం సూర్య వస్తూత్తమాయై నమః ఓం శ్రీ విద్యాయై నమః ఓం ప్రనవాద్యై నమః
ఓం త్రిపురాయై నమః ఓం షోడశాక్షర దేవతాయై నమః ఓం స్వధాయై నమః ఓం ఆర్యాయై నమః
ఓం దీక్షాయై నమః ఓం శివాభిదానాయై నమః ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః
ఓం నాద రూపాయి నమః ఓం త్రిగునామ్బికాయై నమః ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

ధూపం
హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై
రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం
తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ
న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దూపమాగ్రాపయామి

దీపం 
లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే
మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై
చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై
ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి

నైవేద్యం
హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం
దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా
దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం
మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి

తాంబూలం 
సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై
ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై
ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై
పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం
కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త
పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి
తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.

పరాంకుషౌ పాశామభీతి ముద్రం
కరైర్వహన్తీం కమలాసనస్తాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం
భజేహ మంబాం జగదీశ్వరీం తాం.

మంత్రపుష్పం 
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్ 
హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి
వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే
సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే
సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ
కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని ఆశ్రయించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు మందహాసంతో..ఏం చేయాలన్నట్టు పార్వతివైపు చూశాడు.మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారని అన్నది జగన్మాత. అలా తన మాంగల్యంపై ప్రగాఢమైన విశ్వాసంతో,లోకవినాశానికి కారణమైన  భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మంగళరూపిణి అయిన గౌరీదేవిని శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూజిస్తే వైధవ్య బాధలుండవని చెబుతారు.  

Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sriram Interview | పరిటాల రవి చనిపోలేదంటున్న పరిటాల శ్రీరామ్ | ABP DesamJr NTR Fires on Photographer | ఫొటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ ఆగ్రహం | ABP DesamRaptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
IPL 2024: బ్యాటింగ్ కు దిగిన  కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా, పంజాబ్‌ ఆపగలదా ?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
అనుపమ కొత్త సినిమా లుక్... పరదా వెనుక దాగిన రహస్యం ఏమిటి?
Warangal News: ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
ప్రియుడు, అక్కతో కలిసి యజమాని ఇంట్లోనే పని మనిషి చోరీ - కారు కొనేసి జల్సాలు!
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Embed widget