News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Varalakshmi Vratham 2022: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ

గణపతి పూజ, వరలక్ష్మీ పూజ అనంతరం నైవేద్యం సమర్పించి తోరం కట్టుకున్నాక..వరలక్ష్మీ వ్రత కథ చెప్పుకోవాలి. లోకోపకారం కోసం శివుడు పార్వతీదేవికి చెప్పిన ఆ కథ మీకోసం....

FOLLOW US: 
Share:

వరలక్ష్మీ వ్రత కథ

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. ఆ కథే ఇది..

పరమేశ్వరుడు ఒకరోజు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

పూర్వం మగథ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తిగౌరవాలు ఉన్న యోగ్యురాలు. రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి…ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని సేవిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి…. ఈవిషయం అత్తింటివారికి చెప్పింది. శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైవుదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వా భరణ భూషితులయ్యారట. వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతితో పాటూ ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. 

Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రతకథ విన్నా, చేసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు తలపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎన్నో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి….

Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు

Published at : 29 Jul 2022 08:44 AM (IST) Tags: Sawan 2022 Sravana Masam 2022 Varalakshmi Vratham 2022 Varalakshmi Vratham pooja vidhi Varalakshmi Vratham story Varalakshmi Vratham kadha

ఇవి కూడా చూడండి

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Horoscope Today September 22, 2023 :ఈ రాశివారు టైమ్ వేస్ట్ చేయడంలో ముందుంటారు, సెప్టెంబరు 22 రాశిఫలాలు

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు బాగా సంపాదిస్తారు తక్కువ ఖర్చు చేస్తారు!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Astrology : ఈ రాశివారు ఎప్పుడూ ఒకరి అధీనంలోనే ఉంటారు, ఈ రాశివారి లక్షణమే ఇది!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

Chanakya Niti In Telugu : భర్త అనుమ‌తి లేకుండా భార్య వెళ్ల‌కూడ‌ని 4 ప్రదేశాలు ఇవే!

టాప్ స్టోరీస్

Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి

Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్

Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్