Varalakshmi Vratham 2022: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
ఏ పూజ చేసినా బొజ్జగణపయ్య పూజతోనే ఆరంభిస్తాం. వరలక్ష్మీ వ్రతం ప్రారంభించేముందు కూడా గణపతి పూజ ముందుగా పూర్తిచేసి ఆ తర్వాత వరలక్ష్మీ పూజ ప్రారంభించాలి...
గణపతి పూజ అనంతరం.....
Also Read: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
కలశపూజ
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా.. ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః..అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధంగపూజ
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః - పాదౌ పూజయామి, చపలాయై నమః - జానునీ పూజయామి, పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి, మలవాసిన్యైనమః - కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః - ముఖంపూజయామి, సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, రమాయైనమః - కర్ణౌ పూజయామి, కమలాయైనమః - శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాంగాని పూజయామి.
(పూలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:-
ఓం ప్రకృత్యై నమః , ఓం వికృతై నమః , ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః ,ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః , ఓం సురభ్యై నమః , ఓంపరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః , ఓంస్వాహాయై నమః , ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః ,ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః , ఓం లక్ష్మ్యై నమః , ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యైనమః, ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః , ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః , ఓంకామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః , ఓంబుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః , ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓంలోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః , ఓంలోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓంపద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః, ఓంపద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయైనమః, ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓంచంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః , ఓంఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః , ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః, ఓంభాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓంహేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓంవరలక్ష్మ్యై నమః , ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓంహిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః, ఓంమంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యైనమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః, ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓంభువనేశ్వర్యై నమః
కంకణపూజ
కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకం చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే