Marriage Dates in Shravana Masam 2024: 2024 శ్రావణమాసంలో శుభముహూర్తాలివే.. ఇప్పుడు కూడా టైమ్ తక్కువే ఉంది త్వరపడండి!
Marriage Dates in Shravana Masam 2024: ఏటా సమ్మర్లో శుభకార్యాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ ఏడాది మూఢాలు రావడంతో మే నెలంతా ఎలాంటి హడావుడి లేదు.. శ్రావణం రావడంతో మళ్లీ శుభఘడియలు మొదలు...
Best Marriage Dates in Shravana Masam (August) 2024: ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరివారంతో శుభ ఘడియలు ముగిసాయి. ఆ తర్వాత ఏప్రిల్ 27 నుంచి జూలై 11 వరకూ శుక్ర మూఢమి.. మే 07 నుంచి జూన్ వరకూ గురుమూఢమి ఉండడంతో ఎక్కడా శుభకార్యాల సందడి లేదు. ఆ తర్వాత ఆషాఢమాసం రావడంతో వరుసగా మూడు నెలల పాటూ ముహూర్తాల మాటే వినిపించలేదు. ఇప్పుడు శ్రావణం ప్రారంభంకావడంతో మళ్లీ ఈ నెలలో శుభకార్యాలు హోరెత్తిపోనున్నాయి.
ఆగష్టు 5 సోమవారం నుంచి శ్రావణమాసం మొదలైంది. సెప్టెంబర్ 3తో ముగుస్తుంది..ఆఖరి రోజు అమావాస్య కాబట్టి ఎలాగూ మూహుర్తాలుండవు. పెళ్లిచూపులు, వివాహం, గృహారంభానికి ఈ లోగా చాలా మంచిరోజులున్నాయి. ఈ టైమ్ దాటితే మళ్లీ కార్తీకమాసం వరకూ మళ్లీ బ్రేక్ పడుతుంది. అందుకే ఇప్పటికే ఆలస్యం అయింది అనుకున్నవారు ఆగష్టులో ముహూర్తం పెట్టేసుకోండి. ఆగష్టు 7, 8, 9, 10, 11 , 15, 16, 17, 18, 21, 22, 23, 24, 28 తేదీల్లో పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన తేదీల్లో ఎందుకు ముహూర్తాలు లేవనే సందేహం వచ్చి ఉంటుంది...అవి అష్టమి, నవమి తిథులు వచ్చిన రోజులు. నెల మొత్తంలో 17, 18 తేదీలు అత్యంత శుభకరంగా ఉన్నాయని ఈ రెండు రోజులు శుభకార్యాలు హోరెత్తిపోనున్నాయంటున్నారు పండితులు.
ఆగష్టు 07 తదియ బుధవారం - పెళ్లి చూపులు, వ్యాపారం - వాహనం ప్రారంభోత్సవానికి మంచిది. గృహప్రవేశ ముహూర్తం ఉంది
ఆగష్టు 08 చవితి గురువారం - వివాహం, గృహారంభం, వ్యాపారం, నామకరణ మహోత్సవం, నిశ్చయతాంబూలం, భూముల రిజిస్ట్రేషన్ కి మంచిది
ఆగష్టు 09 పంచమి శుక్రమవారం - వివాహం, గృహారంభం, శంఖుస్థాపన, పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలం, వాహన ప్రారంభం, నామకరణానికి మంచిది
ఆగష్టు 10 షష్ఠి శనివారం - వివాహం, గృహారంభం, వాహన ప్రారంభానికి మంచిది (షష్ఠి చాలామందికి నెగెటివ్ సెంటిమెంట్ ఉంటుంది.. అయితే తారాఫలం చూసుకోవడం కూడా ముహూర్తానికి చాలా ముఖ్యంధ
ఆగష్టు 11 సప్తమి ఆదివారం - నిశ్చయతాంబూలం, వాహనం ప్రారంభం, వ్యాపార ప్రారంభం, గృహప్రవేశం, గర్భాదానం, గృహారంభానికి మంచిది
ఆగష్టు 12 అష్టమి సోమవారం - అష్టమి రోజు శుభకార్యాలు తలపెడితే కష్టాలు తప్పవనే సెంటిమెంట్ చాలామందిలో ఉంది
ఆగష్టు 13 నవమి మంగళవారం - వివాహం, గృహప్రవేశం, గృహారంభం, వ్యవసాయపనులకు మంచిది
ఆగష్టు 15 దశమి గురువారం - చెవులు కుట్టించేందుగు, వ్యాపారం ప్రారంభించేందుకు, గృహప్రవేశం, గర్భాదానం కార్యక్రమాలకు మంచిది
ఆగష్టు 16 ఏకాదశి శుక్రవారం - గర్భదానం, వ్యవసాయ పనులు ప్రారంభానికి, బోర్లు వేసేందుకు మంచిరోజు
ఆగష్టు 17 త్రయోదశి శనివారం - ఈ రోజు వ్యాపారం, పెళ్లి చూపులు, నిశ్చితార్థం, వాహన ప్రారంభానికి మంచిది
ఆగష్టు 18 చతుర్థశి ఆదివారం - వివాహం, గృహారంభం, గృహప్రవేశం , నామకరణం, గణపతి నవరాత్రుల పనులకు పందిరిరాట వేసేందుకు మంచిది
ఆగష్టు 19 పౌర్ణమి సోమవారం - గృహారంభం, గృహప్రవేశం , నామకరణం, గర్భాదానానికి మంచిది
ఆగష్టు 20 బహుళ పాడ్యమి మంగళవారం - వివాహం, గృహారంభం, గృహప్రవేశానికి మూహూర్తాలున్నాయి
ఆగష్టు 21 విదియ బుధవారం - వ్యాపారం, వాహనం ప్రారంభం, నిశ్చితార్థం, గర్భాదానానికి మంచిది
ఆగష్టు 22 తదియ గురువారం - వివాహం, గృహారంభం, గృహప్రవేశం , నామకరణం, వ్యాపార ప్రారంభానికి మంచిది
ఆగష్టు 23 చవితి శుక్రవారం - వివాహం, గృహారంభం, గర్భాదానానికి మంచిది
ఆగష్టు 24 పంచమి శనివారం - పెళ్లిచూపులు, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, నిశ్చితార్థం , గృహప్రవేశం, గర్భాదానానికి ముహూర్తాలున్నాయి
ఆగష్టు 25 షష్ఠి ఆదివారం-----
ఆగష్టు 26 సప్తమి సోమవారం - సాధారణపనులకు, ఆపరేషన్స్ కి మంచిది
ఆగష్టు 27 అష్టమి మంగళవారం - అష్టమి రోజు ఏపనులు తలపెట్టరు..మంగళవారం సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది.. ఈ రోజు గృహప్రవేశం, గృహారంభానికి ముహూర్తాలున్నాయి
ఆగష్టు 28 దశమి బుధవారం - వివాహం, గృహారంభం, గృహప్రవేశానికి ముహూర్తాలున్నాయి
ఆగష్టు 29 ఏకాదశి గురువారం , ఆగష్టు 30 ద్వాదశి, ఆగష్టు 31 త్రయోదశి, సెప్టెంబరు 1 చతుర్థశి, సెప్టెంబరు 2 ,3 తేదీల్లో అమావాస్య ఘడియలున్నా.. అమావాస్యకి నాలుగు రోజుల ముందునుంచీ ఎదురు అమావాస్య పేరుతో శుభకార్యాలు తలపెట్టరు...
సెప్టెంబరు 4 బుధవారం నుంచి బాధ్రపదమాసం ప్రారంభం అవుతుంది...భాద్రపదంలో వచ్చే నాలుగోరోజు నుంచి గణపతి నవరాత్రుల సందడి మొదలైపోతుంది...
గమనిక: ఇందులో వివరించిన తేదీలు, ముహూర్తాలు నిర్ణయించుకునేముందు... నక్షత్రం, దంపతుల నక్షత్రాలను కూడా పరిగణలోకి తీసుకుని పండితులు ముహూర్తం నిర్ణయిస్తారు. ఇవి కామన్ గా ఉండే ముహూర్తాలు..వీటిలో మీకు ఏం నప్పుతుంది అన్నది ఓసారి తారాఫలం కూడా చూసుకుని ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది...