Budh Vakri Rashifal 2024: సింహ రాశిలో బుధుడి తిరోగమనం..రెండు వారాలపాటూ ఈ రాశులవారికి ఏం చేసినా వ్యతిరేక ఫలితాలే!
Budh Vakri Rashifal 2024: సింహరాశిలో సంచరిస్తున్న బధుడు ప్రస్తుతం అదే రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే ఈ రాశులవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది
Mercury Retrograde 2024: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ నిర్ధిష్ట సమయం తర్వాత రాశి, నక్షత్రం మారుతాయి. జూలై 20న సింహరాశిలో ప్రవేశించిన బుధుడు... ప్రస్తుతం అదే రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరో రెండు వారాలవరకూ ఇదే రాశిలో ఉండి... ఆ తర్వాత కర్కాటకంలో అడుగుపెట్టనున్నాడు. గ్రహాల రాకుమారుడైన బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారి జీవితంలో అద్భుతమైన మార్పులొస్తాయి. అదే సమయంలో కొన్ని రాశులవారికి ఇబ్బందులు తప్పవు. మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యంగా బుధుడి తిరోగమనం వల్ల ఈ 5 రాశులవారి జీవితంలో ఇబ్బందులు తప్పవు.
మేష రాశి (Aries)
సింహ రాశిలో బుధుడు తిరోగమనం మేషరాశివారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి..తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సోమరితనం తగ్గించుకోవాలి. చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించి, అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.
Also Read: ఈ రాశులవారు కొత్తదనం కోరుకుంటారు.. అందుకోసం అడ్వెంచర్స్ చేసేందుకు వెనుకాడరు!
వృషభ రాశి (Taurus)
బుధుడి తిరోగమనం వల్ల వృషభ రాశివారి కెరీర్లో అడ్డంకులు తప్పవు. ఉద్యోగం, వ్యాపారంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక ఖర్చుల వల్ల ఆందోళన చెందుతారు. ఆదాయం పెరుగుతుంది కానీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. వైవాహిక జీవితంలో టెన్షన్ పెరగవచ్చు
కన్యా రాశి (Virgo)
సింహంలో బుధుడి తిరోగమనం స్థితి కన్యారాశి వ్యక్తుల జీవితాల్లో అనేక సమస్యలను తెస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పోటీ వాతావరణం ఉంటుంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వృత్తి జీవితంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు గందరగోళానికి గురవుతారు.
మకర రాశి (Capricorn)
మకర రాశివారికి బుధుడి తిరోగమనం ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి..ముఖ్యంగా భారీ ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. మాటల విషయంలో నియంత్రణ అవసరం. ఎవరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు. కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఖర్చులు తగ్గించండి. పరిశోధన చేయకుండా పెట్టుబడి పెట్టవద్దు.
Also Read: 9 నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం - సర్పదోషం, నాగదోషం సహా సకల దోషాలకు పరిహారం!
మీన రాశి (Pisces)
బుధుడి తిరోగమనం ఆగష్టు నెల ప్రథమార్థం మీనరాశివారికి మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ సమయంలో ఆర్థిక నష్టాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో రాజకీయాల ప్రభావం మీ పనితీరుపై పడుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. పనిపట్ల ఆసక్తి ఉండదు. అనుకున్న మంచి ఫలితాలు ఏవీ ఈ సమయంలో పొందలేరు. ఓపికగా వ్యవహరించాల్సిన సమయం ఇది
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!