అన్వేషించండి

Nag Panchami 2024: 9 నాగశక్తులను ప్రసన్నం చేసుకునే కవచం - సర్పదోషం, నాగదోషం సహా సకల దోషాలకు పరిహారం!

Naga Kavacham: నాగదోషం, కాల సర్పదోషం, వివాహం - సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు వివిధ రకాల శాంతులు చేయించుకుంటారు. అయితే నిత్యం ఈ కవచం పఠిస్తే మీరు ఊహించనంత ఉపశమనం లభిస్తుందంటారు పండితులు..

Naga Dosha Remedies:  పెళ్లి కాలేదు, ఆరోగ్యం బాలేదు, పిల్లలు కలగడం లేదని ఎవరైనా జ్యోతిష్యుడిని సంప్రదిస్తే సాధారణంగా చెప్పే విషయాలేంటంటే..  నాగదోషం ఉందని, సర్పదోషం ఉందని , గ్రహ దోషం , రాహుకేతు దోషాలున్నాయని చెబుతారు. దానికోసం శాంతులు చేయమంటారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఇలాంటి వారికి శాంతులను మించి ఉపశమనం ఇస్తుంది నాగ కవచం. వీటితో పాటూ మీ తర్వాత ఉత్తర క్రియలు చేసేవారు లేకపోతే ఆ దోషాన్ని ముందుగా తొలగిస్తుంది ఈ నాగకవచం

నాగకవచం, సుబ్రహ్మణ్యకవచం ఒకటే అనుకుంటారేమో..రెండూ వేర్వేరు. ప్రకృతిలో నవనాగశక్తులు అని ఉన్నాయి...

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || 

ఈ తొమ్మిది నాగశక్తులను ప్రశన్నం చేసుకునే కవచం ఇది. 

Also Read: ఆగష్టు 04 చుక్కల అమావాస్య..ఇలా చేస్తే మీరు ఉహించనంత ఫలితం పొందుతారు!

నాగుల చవితి , నాగ పంచమి (2024 ఆగష్టు 08 రాయలసీమలో నాగులచవితి, ఆగష్టు 09 న గరుడపంచమి) రోజు ఈ కవచం చదకువుకుంటే అత్యుత్తమం..మిగిలిన ఏ రోజుల్లో అయినా ఈ కవచం చేయొచ్చు.. 
నాగ కవచం (Naga Kavacham )

నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదమ్ |
ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || 

తారాబీజం శివాశక్తిః క్రోధబీజస్తు కీలకః |
దేవతా నాగరాజస్తు ఫణామణివిరాజితః || 

సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః |
అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్తథా || 

కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకమ్ |
వక్షఃస్థలం నాగయక్షః బాహూ కాలభుజంగమః || 

ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్ఠకమ్ |
మర్మాంగమశ్వసేనస్తు పాదావశ్వతరోఽవతు || 

వాసుకిః పాతు మాం ప్రాచ్యే ఆగ్నేయాం తు ధనంజయః |
తక్షకో దక్షిణే పాతు నైరృత్యాం శంఖపాలకః || 

మహాపద్మః ప్రతీచ్యాం తు వాయవ్యాం శంఖనీలకః |
ఉత్తరే కంబలః పాతు ఈశాన్యాం నాగభైరవః || 

ఊర్ధ్వం చైరావతోఽధస్తాత్ నాగభేతాళనాయకః |
సదా సర్వత్ర మాం పాతు నాగలోకాధినాయకాః ||

ఇతి నాగ కవచమ్ |

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

నాగ కవచం అర్థం

ఈ కవచం నాగరాజుకి సంబంధించినది..అన్నిరకాల కోర్కెలు తీర్చేది. నాగేంద్రుడు ఓ శిరస్సుతో కానీ చాలా శిరస్సులతో కానీ ఉన్నట్టు..తలపై మణి ఉన్నట్టు తలుచుకుని ధ్యానం చేయండి. కవచంలో రెండు భాగాలుంటాయి... ఒంట్లో భాగాలను దేవతా శక్తి ఎలా కాపాడాలో ఓ భాగం... మనచుట్టూ ఉన్న పది దిక్కుల నుంచి మనల్ని కాపాడాలని చెబుతూ రెండో భాగం ఉంటుంది. 

కవచం మొదటి భాగంలో...

శిరస్సును అనంతుడు , కంఠాన్ని సంకర్షణుడు, కళ్లను కర్కోటకుడు, చెవులను కపిలుడు, వక్షస్థలాన్ని నాగయక్షుడు, భుజాలని కాలసర్పం, 
ఉదరాన్ని ధృతరాష్టుడు అనే నాగశక్తి, వెనుక భాగాన్ని వజ్రనాగుడు, మర్మాంగాలను అశ్వశేనుడు, పాదాలను అశ్వథరుడు కాపాడాలని అర్థం....

కవచం రెండో భాగంలో..

తూర్పు దిశనుంచి వాసుకి, ఆగ్నేయ దిశలో ధనుంజయుడు, దక్షిణ దిశలో తక్షకుడు, నైరుతి దిశలో శంఖపాలుడు, పడమర వైపు మహాపద్ముడు
వాయువ్యం వైపు శంఖనీలకుడు, ఉత్తరం వైపు కంబలుడు, ఈశాన్యంలో నాగభైరవుడు, ఊర్థ్వ దిక్కున ఐరావతం అనే నాగశక్తి, అధోః దిక్కున నాగబేతాళుడు కాపాడమని వేడుకుంటున్నానని అర్థం 

నాగ కవచం పఠించాలి అనుకుంటే...ముందు శుచిగా స్నానమాచరించాలి. రజస్వల సమయం, మైల ఉన్నప్పుడు మాత్రం చదవకూడదు. ఈ కవచం చదివేటప్పుడు పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించాలి. ఎలాంటి గ్రహదోషాలు, సర్పదోషాల నుంచి అయినా ఈ కవచం మిమ్మల్ని బయటపడేస్తుంది. 

Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget