నాగిని గా మారే పాములు ఇప్పటికీ ఉన్నాయా?

Published by: RAMA

కార్తీకమాసం వచ్చే నాగుల చవితి రోజు కొందరు... శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి రోజు కొందరు నాగదేవతను పూజిస్తారు

పురాణ కథల్లో, సినిమాల్లో నాగినిగా మారే నాగుపాములను చూసే ఉంటారు ..అవి నిజంగా ఉంటాయా?

వేదకాలం సంగతి పక్కనపెడితే.. నాగినిగా మారే నాగులు ఇప్పుడు ఉన్నాయనుకోవడం భ్రమే అంటారు పండితులు

విజ్ఞాన శాస్త్రం కూడా నాగినిగా మారే నాగులు ఉండవనే చెబుతారు

ఓ మనిషి పాముగా.. ఓ పాము మనిషిగా మారడం అనేది సాధ్యంకాదంటారు

నాగ పంచమి రోజున నాగబంధాన్ని పూజించడం, రావిచెట్టుకి పూజలు చేయడం శుభప్రదం

శ్రావణమాసంలో నాగపూజ చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది