దక్షిణ భారతదేశంలో అద్భుతమైన 9 పండుగలు

Published by: RAMA
Image Source: Canva

ఓనం

కేరళ రాష్ట్రంలో జరిగే పంటల పండుగ, ఇది ప్రతి సంవత్సరం రాక్షస రాజు మహాబలి సందర్శనను సూచిస్తుంది. ఈ పండుగలో భాగంగా నిర్వహించే పడవల పోటీ కన్నులపండువగా ఉంటుంది

Image Source: Canva

మైసూర్ దసరా

చాముండేశ్వరి దేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని స్మరించే ఒక పండుగ. జంబూ సవారి ఊరేగింపు తర్వాత మైసూర్ ప్యాలెస్ ను ప్రకాశవంతంగా అలంకరిస్తారు, చివరగా రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తారు.

Image Source: Twitter/ thinkbigh

పొంగల్

తమిళనాడులో నాలుగు రోజుల పాటు జరుపుకునే పంటల పండుగను పొంగల్ అంటారు, ఇది ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ.

Image Source: PTI

హoపి ఉత్సవ్

నవంబర్ నెలలో జరిగే హంపి ఉత్సవ్ విజయనగర సామ్రాజ్యం సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వం. తోలుబొమ్మలాటలు, జానపద సంగీత కచేరీలు , హస్తకళా ప్రదర్శనలు బాగా జరుగుతాయి

Image Source: Twitter/ distantfrontier

కరగా

కర్ణాటక రాష్ట్రంలో పురాతన పండుగలలో ఒకటైన కరగ, శక్తి దేవతను పూజిస్తారు. శౌర్యం, ఐక్యత మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని జరుపుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

Image Source: Twitter/ ram_vairamudi

త్రిసూర్ పూరం

త్రిసూర్ పూరం కేరళలో లుక్ వడక్కునాథన్ ఆలయంలో నిర్వహిస్తారు. ఏనుగుల అలంకరణలు అద్భుతమైన దృశ్యం

Image Source: Twitter/ AnuSatheesh5

చిత్తరై తిరువిళా

మీనాక్షి తిరుకల్యాణం, మీనాక్షి పట్టాభిషేకం, ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తూ ఊరేగింపులు ఆచారాలతో సహా మధురైలో ఒక నెల పాటు ఘనంగా జరుపుకుంటారు.

Image Source: Twitter/ tamilbrahmins

ఉగాది

తెలుగు నూతన సంవత్సరం. ఇది కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. ఉగాది పచ్చడి చేసి జీవితంలోకి అన్ని రుచులను ఆహ్వానిస్తారు . అంతా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు

Image Source: Twitter/ anilbhatortho

మహామహం ఉత్సవం

కుంభకోణంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా మహం ఉత్సవంలో పాల్గొంటే పాపాలు కడిగేస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహా మహం ట్యాంక్‌లో పవిత్ర స్నానం చేస్తారు.

Image Source: Twitter/ thil2004