Kuppam : చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !
చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే ఆయన కారుపై బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీకి చెందిన సెంధిల్ కుమార్ అనే నేత హెచ్చరించడం వివాదాస్పదమయింది. టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
![Kuppam : చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత ! YSRCP leader warns that they will bomb Chandrababu if he comes .. Tension in the Kuppam! Kuppam : చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/21/5b4dac14161ccc76a4afa5dfe557d819_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు వస్తే ఆయనపై బాంబు వేస్తాని వైఎస్ఆర్‌సీపీ నేత సెంధిల్ కుమార్ హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు కుప్పంలో ఆ పార్టీ నేతలు జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. రెండో రోజు ఎంపీ రెడ్డప్ప కుప్పం వచ్చి దీక్షల్లో పాల్గొన్నారు. కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ దీక్షల్లో పాల్గొన్నారు. రెస్కో విద్యుత్ సహకార సంస్థకు చైర్మన్‌గా ఇటీవల పదవి పొందిన సెంథిల్ కుమార్ అనే నేత కూడా దీక్షలో పాల్గొని ప్రసంగించారు. మైక్ అందుకున్నప్పటి నుండి ఆయన తిట్ల పురాణమే వినిపించారు.
Also Read : అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న
చంద్రబాబును బండబూతులు తిట్టారు. కుప్పం వస్తే బాంబులేస్తామని హెచ్చరించారు. ఆయన బూతు పంచాంగాన్ని ఎంపీ రెడ్డప్ప కూడా తట్టుకోలేకపోయారు. ఆయన వద్ద నుంచి మైక్ లాక్కున్నారు. సెంధిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. కుప్పంలో ఆందోళనలు ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి వెళ్లారు. దీంతో ఉద్రిక్తి పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఎక్కడిక్కడ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. టీడీపీ నేతల వద్ద ఫిర్యాదు తీసుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షల్లో చంద్రబాబుపై ఇష్టారీతిన తిట్ల వర్షం కురిపిస్తున్నారు. కొంత మంది ఖూనీలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళగిరిలో కాబట్టి రాళ్లేశారని..అదే రాయలసీమలో అయితే ఖూనీలు చేసే వారమని హెచ్చరించారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబు కారుపైనే బాంబులు వేస్తామని హెచ్చరికలు చేయడం కలకలం రేపుతోంది.
Also Read : వివాదంలో జనసేన ఎమ్మెల్యే రాపాక ! అనర్హతా వేటు పడుతుందా ?
గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో ఆరోపణలు చేసిన నక్కా ఆనంద్ బాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వివాదం ప్రారంభమయింది. నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఖండించారు. ఓ పదంతో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించారు. సీఎం జగన్‌ను కూడా అలాగే తిట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టాభి ఇళ్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులు ప్రారంభించడంతో రాజకీయం ఉద్రిక్తంగా మారింది.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)