Janasena MLA : వివాదంలో జనసేన ఎమ్మెల్యే రాపాక ! అనర్హతా వేటు పడుతుందా ?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకుని మరీ ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హతా వేటు వేయవచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు గెలిచారు. అయితే కొన్నాళ్ల తర్వాత జనసేన పార్టీతో విభేదించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపారు. అయితే అధికారికంగా ఆ పార్టీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే తక్షణం అనర్హతా వేటు వేస్తామని సీఎం జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారం కూడా గతంలో పలుమార్లు అసెంబ్లీలోనే చెప్పారు. ఈ కారమంగా ఆయనకు వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పలేదు.
అధికారికంగా ఆయన ఇప్పటికి జనసేన ఎమ్మెల్యేనే. అయితే గురువారం ఆయనో తప్పు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. వైసీపీ జెండా కప్పుకుని తాను అచ్చమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలా ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. మెడలో వైసీపీ జెండా వేసుకుని మరీ ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఆయన అధికారికంగా పార్టీ ఫిరాయించారనేదానికి ఆధారాలు లభించినట్లయింది.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోమని గతంలో చెప్పారు. అయితే ఆయన పార్టకి పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సంఘిభావం చెప్పారు. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వంటి వారు మద్దతు పలికారు. అయితే వారి కుటుంబసభ్యులకు సీఎం జగన్ కండువాలు కప్పారు కానీ వారికి కప్పలేదు. దాంతో వారిపై అనర్హతా వేటు వేయాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాపాక కూడా అంతే. అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఈ కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని వాదిస్తూ వచ్చారు.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు రాపాక కూడా అసెంబ్లీలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగితే ఆయన వాకౌట్ చేస్తున్నారు. ఇప్పుడు అత్యాత్సాహంతో పార్టీ కండువా కప్పుకుని మరీ నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలా వైసీపీ కండువాతో ఉండకూడదని సభకు వచ్చిన వాళ్లుచెప్పడంతో తర్వాత తీసేశారు. కానీ అప్పటికీ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి