By: ABP Desam | Updated at : 22 Oct 2021 09:08 AM (IST)
Edited By: Venkateshk
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్‌డీసీ) ద్వారా రుణాలు పొందుతున్న వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన అసలు పత్రాను తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరు ఎలా చేరుస్తారని ప్రశ్నించింది.
గవర్నర్ పేరు చేర్చిన అంశంపై స్పందిస్తూ.. రూ.25 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆస్తులు తనఖా పెట్టి... అనంతరం తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలం చెందితే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేయడం, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని ధర్మాసనం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌పై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ ఒప్పందం ద్వారా గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది. అంతేకాక, ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీ ఎస్డీసీకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారని ప్రశ్నించింది.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జయ చేయకుండా నేరుగా ఎస్‌డీసీకి జమ చేస్తున్నామనే వాదనలో నిజం లేదని ఏజీ ధర్మాసనానికి వివరించారు. ఎస్‌డీసీ ఏర్పాటు రాజ్యాంగ, చట్ట విరుద్ధం కాదని కేవలం పిటిషనర్ రాజకీయ దురుద్దేశాలతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఏజీ వివరించారు. పిటిషనర్లు టీడీపీ వ్యక్తులని, రాజకీయ విమర్శల కోసమే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని వివరించారు. కాబట్టి పిల్‌ను కొట్టివేయాలని కోరారు.
Also Read: Weather Updates: ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో పొడిగా వాతావరణం.. రాగల 5 రోజుల్లో ఇలా..
వాదనల్లో భాగంగా.. ప్రభుత్వం వేర్వేరు మార్గాల ద్వారా తెచ్చుకుంటున్న రూ.లక్షల కోట్ల అప్పులకు సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున గ్యారెంటీ పత్రాలపై ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారే ఈ సంతకాలు పెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్ల రుణానికి కూడా ఈయనే సంతకం పెట్టారు. ఇప్పుడేమో ఆ రుణానికి, గవర్నర్‌కూ సంబంధం లేదని హైకోర్టులో ఏజీ చెప్పారు. అలాంటప్పుడు బ్యాంకులు ఆ అప్పులను ఎవరిని అడగాలంటూ ధర్మాసనం అడిగింది.
Also Read: Hyderabad: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువకుడు, చివరికి జైలు పాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
YSR Sanchara Pasu Arogya Seva : మూగజీవాలకు అంబులెన్స్‌లు, వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభించి సీఎం జగన్
Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!