Weather Updates: ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో పొడిగా వాతావరణం.. రాగల 5 రోజుల్లో ఇలా..
తెలంగాణలో రాగల ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అంచనా వేసింది. రాగల ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండబోవని స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. 23వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 26న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందువలన నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది.
అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తిరోగమన రేఖ.. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఈ కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!
ఉత్తర కోస్తాంధ్రా, యానం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో పొడిగా వాతావరణం
తెలంగాణలో రాగల ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అంచనా వేసింది. రాగల ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉండబోవని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు.
మరోవైపు, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబరులో ఢిల్లీలో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. రుతుపవనాలు ఆలస్యంగా విరమించడం, అనేక ప్రాంతాల్లో అల్పపీడనాలు ఏర్పడటం వల్లే అక్టోబరులో విపరీతమైన వర్షాలు కురిసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఈ నెలలో నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడతాయి. ఈ కారణంగావర్షాలు తక్కువగా నమోదవుతాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో దేశంలోని తూర్పు ప్రాంతాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. గత వారంలో అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదైన సంగతి తెలిసిందే.
Also Read: అన్ని నగరాల్లో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు ఎంతంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి