By: ABP Desam | Updated at : 22 Oct 2021 07:49 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కొద్ది రోజులుగా ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు కూడా కొన్ని నగరాల్లో వ్యత్యాసం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోనూ మరోసారి ధరలు ఎగబాకాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.36 పైసలు పెరిగి రూ.110.82 అయింది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.103.94గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.54 పైసలు పెరిగి రూ.110.54 అయింది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి రూ.103.67 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.31 పైసలు పెరిగి.. రూ.110.95గా ఉంది. డీజిల్ ధర రూ.0.33 పైసలు పెరిగి రూ.104.05 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.26 పైసలు పెరిగి రూ.112.51 గా ఉంది. డీజిల్ ధర రూ.0.29 పైసలు పెరిగి రూ.105.51 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.112.90 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.17 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.105.42కి చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.112.39గా ఉంది. గత ధరతో పోలిస్తే లీటరుకు రూ.0.33 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.104.90గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.60 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.57 పైసలు పెరిగి.. రూ.113.30 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.105.77గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.57 పైసలు పెరిగింది. క్రమంగా పెరుగుతూ వస్తున్న ముడిచమురు ధరలే ఇంధన ధరలు ఎగబాకేందుకు కారణంగా తెలుస్తోంది.
Also Read: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 20 నాటి ధరల ప్రకారం 82.96 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు