News
News
X

AP Politics: నిన్నటి వరకూ బూతులు.. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?

ఏపీ రాజకీయ పార్టీలన్నీ బూతుల దశను దాటి దాడులకు వచ్చాయి. వాటి తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారింది. సమీక్షించుకుని పరిస్థితులు మార్చకపోతే భవిష్యత్ తరాలకు చెడు సంప్రదాయాలు ఇచ్చినట్లవుతుంది.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో మెట్టు దిగజారాయి. ఇంతకన్నా దిగజారడానికి ఇంకేం లేదు అనుకున్న ప్రతిసారీ మరోమెట్టు పడిపోతున్నాయి. మామూలుగా మనం ప్రతిరోజూ స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకుంటాం. ఇన్ని పాయింట్లు పెరిగింది..అంత పడిపోయింది.. అని... ఇప్పుడు ఏపీ గురించి కూడా అదే చెప్పుకోవాలేమో. ఇంత పడిపోతున్నాయి.. నాయకులు ఏ స్థాయికి పడిపోతున్నారు అని... గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అందరూ శాకాహారులే.. కానీ బుట్టలో చేపలు మాత్రం మాయం అయిపోయినట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి.. ఎవరకి వారు మేం ఉత్తములమే... అవతలివారిదే తప్పు అన్నట్లు ఉన్నారు. ఎవరికి వాళ్లు వీళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాగే బిహేవ్ చేస్తున్నారు కానీ.. ప్రజలు ఏం అనుకుంటున్నారో.. ఎవరికీ పట్టడంలేదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి ఇంకా ఎంత దిగజారుతుంది.. దిగజారనుంది? ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వారంటే లెక్కలేనట్లుగా ప్రతిపక్షం ప్రవర్తిస్తుందా.. ?  ప్రతిపక్షంలో ఉన్న వారితో సంబంధం లేనట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తుందా... వారికి ముఖ్యమంత్రి కానట్లు జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తారా...? అధికారంలో ఉన్న వారు పార్టీ స్థాయిలో జరగాల్సిన రాజకీయ స్పందనకు పరిపాలన మధ్య గీత ఎందుకు గీయ లేకపోతున్నారు?.

Also Read : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్

టీడీపీ అధికార ప్రతినిధి సంయమనం కోల్పోయి... పరుష పదజాలంతో విమర్శలు చేశారు. అవి ఎంతమాత్రం సమర్థనీయం, వాంఛనీయం కాదు. కానీ దానికి వచ్చిన రియాక్షన్ అంతకంటే సమర్థించేది కాదు. పూర్తిగా పక్కా ప్లాన్‌తో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగింది అని విజువల్స్ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్లు ఏ పార్టీ వాళ్లు అన్నది ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. కానీ దీనిపై స్పందించిన ఆయా రాజకీయ పక్షాలు రెండూ కూడా వాళ్లు చేసిన తప్పులు గురించి మాట్లాడకుండా... ఎదుటివాళ్ల తప్పుల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ శ్రేణులు దాడులు గురించి మాట్లాడే టీడీపీ వాళ్లు పట్టాభి వ్యాఖ్యలు తప్పు... అని మాటవరుసకు కూడా అనలేదు. ఆ మాటకొస్తే ఇన్నాళ్లూ వైసీపీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి అని టీడీపీ వాళ్లు అడుగుతారు. అది వాస్తవమే కాబట్టి దాన్ని ఎవరు కౌంటర్ చేయలేరు. కానీ ఇన్నాళ్లు వైసీపీ భాష దారుణంగా ఉంది... బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్తూ వస్తున్న టీడీపీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయింది.  

ఇక వైసీపీ స్పందన మరింత ఘోరంగా ఉంది. కొంతమంది నేతలు గొంతులు కోస్తాం అన్నారు. కొంతమంది మంత్రులు చర్మాలు తీస్తాం అన్నారు. ఇక దానికి అదుపులేదు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్.., శాంతిభద్రతలకు బాధ్యతగా ఉన్న డీజీపీ సవాంగ్ చేసిన వ్యాఖ్యలే సమర్థనీయంగా లేవు. 

శాంతిభద్రతల అంశాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దాడులను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం మారుతున్న రాజకీయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ అధికారంలో ఉన్న వాళ్లకి బీపీ వస్తుంది... రేపు అధికారంలోకి వచ్చే వారికీ బీపీ రాకుండా ఉంటుందా..? అలా బీపీలు తెచ్చుకుని దాడులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది ? ముఖ్యమంత్రికి అభిమానులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండకూడదు. జగన్ మోహనరెడ్డికి ఉండొచ్చు. కానీ... జగన్ మోహనరెడ్డి అభిమానులు ఎవరిపైన అన్నా దాడి చేసినప్పుడు.. ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన విధానం వేరుగా ఉండాలి. సీఎం రాష్ట్రంలో ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఎవరిపైన అయినా దాడులు జరిగినప్పుడు వాటిని నివారించేలా మాట్లాడితే బాగుంటుంది. అవతలి వారిది తప్పు ఉండొచ్చు దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అంతే తప్ప దాడులను గ్లోరిఫై చేసేలా మాట్లాడితే అది ప్రజాస్వామ్యం అవ్వదు. మూకస్వామ్యం అవుతుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను గౌరవించాలి. రాజకీయంగా వారికి జగన్ శత్రువు కావొచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థానానికి ఒక గౌరవం ఇవ్వాలి.  
Also Read : ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్

అది ప్రజాస్వామ్యం కాదు ! 

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో రాజకీయాలు పూర్తి స్థాయిలో ఇదేనా ప్రజాస్వామ్యం అనేలా మారాయి. మీరు బూతులు తిడున్నారంటే.. మీరు బూతులు తిడుతున్నార ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. రెండు పార్టీల నేతలు మీరు ఒకటి అంటే.. మేము పది అనగలమని తిట్టుకున్నారు. ఇప్పుడు దాడుల దశకు వచ్చేశారు. వ్యవస్థీకృతంగా జరిగిన దాడులను చూసిన తరవాత ఎవరికైనా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ఓ రకమైన ఆందోళన ఏర్పడటం సహజం. ఏపీ పరిణామాలు అదే అభిప్రాయాన్ని కల్పించాయి. విమర్శిస్తే వెళ్లి దాడులు చేయడమేనా..?  ప్రతిపక్ష పార్టీలకు రక్షణ ఉండదా..?. ఇలా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవా.. ? అనేది అందరికీ వచ్చిన సందేహం. 

రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకుని గెలవాలి. అది గెలుపు. అంతే కానీ ప్రత్యర్థిని బండబూతులు తిట్టడం.. కొట్టాడనికి వెళ్లడం.. దాడులు చేయడం రాజకీయం కాదు. కానీ ఇప్పుడు ఇదే రాజకీయంగా మారిపోయింది. మాటకు మాట.. దెబ్బకు దెబ్బతీయకపోతే వాడిని చేతకాని వాడిగా జత కట్టేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చేసింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. రాజకీయాల్లో అసలు అనుకోరు. ఒకరు తమలపాకుతో ఒకటి అంటే మరొకరు తలుపుచెక్కతో రెండు అంటారు. అది అలా పెరిగిపోతూనే ఉంటుంది. చివరికి ఎక్కడకు చేరుతుందో అంచనా వేయడం కష్టం. ఇదంతా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం తెచ్చిపెట్టేదే. 

Also Read : టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు

 ప్రజలను తక్కువగా అంచనా వేస్తున్న పార్టీలు ! 

ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పాత్రను చాలా తక్కువగా రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని ఓట్లేయరని భావిస్తున్నారు. అందుకే గీత దాటిపోతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు ఓ మాదిరి హద్దు దాటినా ప్రజల్లో విస్తృత చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అందరు నేతలు అదే బాట పట్టారు. చివరికి  ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శుత్రత్వ స్థాయి దాడుల వరకూ వెళ్లింది. ఎదురుపడికే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలే కాదు.. యాక్షన్ కూడా ఉంటుందంటున్నారు.  

Also Read: టీడీపీ కార్యాలయాలపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

భావితరాలకు మేలు చేయకపోయినా పర్వాలేదు.. నష్టం చేయకూడదు..!

రాజకీయ పార్టీలు కేవలం తమ కార్యకర్తలు మాత్రమే ఓటర్లు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. తాము ఏం చేసినా తమ వాళ్లు సమర్థిస్తారు అనే ధోరణికి వచ్చేశారు. ఇది ఎలా తయారైందంటే.. ఎదుటి వాడిని తిట్టని వాడు.. కొట్టని వాడు.. చేతకాని వాడు అన్న స్థాయికి వీళ్లు క్రమక్రమంగా చేరిపోయారు. కానీ వీళ్లంతా తెలుసుకోవలసింది.. ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు. మన ప్రవర్తనను గమనించే...ఓ వర్గం సైలంట్‌గా మనను చూస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్లు స్పందిస్తారు. కానీ అప్పటి వరకూ.. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు, ప్రతిపక్ష పాత్రను నిర్వహించాల్సిన పార్టీలు బాధ్యతగా ఉండాలి. 

Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

Also Read : లోకేశ్‌పై హత్యాయత్నం కేసు.. మరో నలుగురిపై కూడా.. డీజీపీ సంచలన ప్రకటన

Also Read: ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి   

Published at : 20 Oct 2021 01:16 PM (IST) Tags: cm jagan ysrcp attacks Jagan justification for attacks great threat to democracy politics descending on attacks

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీ వ్యాపారి ఇంటిపై దాడి

Breaking News Live Telugu Updates: మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీ వ్యాపారి ఇంటిపై దాడి

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

AP Teachers : ఏపీ టీచర్లకు హాజరే పెద్ద పరీక్ష - "యాప్" సమస్యలకు పరిష్కారమేంటి ?

AP Teachers :  ఏపీ టీచర్లకు హాజరే పెద్ద పరీక్ష -

టాప్ స్టోరీస్

Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్‌లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'

Karthikeya 2 Box Office Collection : నిఖిల్ కెరీర్‌లోనే టాప్ - వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేసిన 'కార్తికేయ 2'

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

PM Kisan Yojana Update: రైతులకు గుడ్‌న్యూస్‌! కిసాన్‌ యోజన 12వ విడత నగదు వచ్చేది అప్పుడే!

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?