AP Bund News: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్

నెల్లూరులో బుధవారం ఉదయం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌పై పరుష పదజాలం వాడుతూ తీవ్రంగా దూషించారు.

FOLLOW US: 

ఏపీలో టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన వేళ జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలు, హౌజ్ అరెస్టులపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తాము అధికారంలో ఉన్నామని చాలా ఓపికతో ఉన్నామని అన్నారు. చివరకు దిగజారి ‘బో***’ లాంటి మాటలు మాట్లాడితే.. తామేం గాజులు తొడుక్కొని కూర్చోలేదని అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ‘చర్మం ఒలిచేస్తాం.. జాగ్రత్త’ అని మంత్రి అనిల్ హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలే తిడుతూ మమ్మల్ని బూతులు తిడుతున్నామని అంటున్నారని మండిపడ్డారు. ‘వాడెవడో దేనికీ పనికిరాని వ్యక్తితో తిట్టిస్తారా’’ అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కూడా ఈ విషయాలు గమనించాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అనడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రిని అరే ఒరే అనడం పవన్ కల్యాణ్ వినలేదా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. నెల్లూరులో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు

‘‘లోకేశ్.. నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టి ఉంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా.. నేను రెడీ, జగన్ కోసం మేం దేనికైనా సిద్ధం. జగన్‌పై అపార విశ్వాసం ఉన్నవాళ్లం. ఆయనపై అనవసర మాటలు మాట్లాడితే చూస్తూ ఉరుకోబోం. వైఎస్ఆర్‌ సీపీ నేతల్ని కుక్కలన్నావుగా.. నిజమే. జగన్‌పైన అపారమైన విశ్వాసం ఉన్నోళ్లం మేం. అపారమైన జగన్ భక్తులం. ఆయన్ను ఏమైనా అంటే మూసుకొని కూర్చుంటామని అనుకోవద్దు. మీరు మగాళ్లయితే రండి... మా రెక్కలు విరగ్గొడతానన్నావుగా.. నేను కాన్వాయ్ కూడా తీసేస్తా. వారం రోజులు ఒంటరిగా నెల్లూరులో తిరుగుతా. దమ్ముంటే ఎవడొస్తాడో రండి’’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు.’’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.

ఇలాంటి మాటలు మాట్లాడితే ఏదైనా జరుగుద్ది: అనిల్
‘‘మేం ఏ రోజూ రేయ్.. అని మాట్లాడలేదు. మీరు బూతులు మాట్లాడితే మేం ఊరుకోవాలా? మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా కార్యకర్తలకు ఆవేశం వస్తది. ఏమైనా జరుగుతుంది.. ఇలాంటి మాటలు మాట్లాడితే.. జగన్ ఫ్యాక్షనిస్టు అయితే మీరు బతికి ఉంటారా అసలు? జగన్ చాలా ఓపికతో ఉన్నారు.. సహనాన్ని పరీక్షించవద్దు. ఇంకోసారి ట్విటర్‌లో చిలకపలుకులు పలకడం లాంటివి వద్దు. దమ్ముంటే డైరెక్ట్‌గా రండి చూస్కుందాం’’ అని అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.

Also Read:  ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు

ఈ బూతులు ఎప్పుడూ వినలేదు: జగన్
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జగనన్న తోడు ప్రారంభం సందర్భంగా ఆయన తాడేపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమను ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని జగన్ అన్నారు. కోర్టు కేసులతో ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ఇలాంటి బూతులు ఎప్పుడూ వినలేదని, కొందరు కావాలనే తిట్టించి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొంత మంది కులాలు, మతాల మధ్య విభేదాలు రేపుతున్నారని అన్నారు. ‘‘మంచి జరిగితే జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఊహతో అల్లర్లు చేస్తున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా సంతృప్తికరంగా ఉండేలా ఉంది. దేవుడి దయ వల్ల మిగతా కాలం కూడా ఇలానే పరిపాలన సాగిస్తాం.’’ అని జగన్ అన్నారు.

Also Read: Jagan Reaction : బూతులు వినలేక .. అభిమానించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్టయ్యారు : జగన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Nara Lokesh Minister Anil Kumar Yadav AP Bundh Issue Chandrabau AP Bundh News AP Bundh in Nellore

సంబంధిత కథనాలు

Sri Talpa Giri: దక్షిణ శ్రీరంగం తల్పగిరి రంగనాథ మందిరం- ఈ గుడిలో అదే జరిగితే కలియగం అంతమైనట్టేనటా!

Sri Talpa Giri: దక్షిణ శ్రీరంగం తల్పగిరి రంగనాథ మందిరం- ఈ గుడిలో అదే జరిగితే కలియగం అంతమైనట్టేనటా!

Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Pregnant Lady Marathon Walk: ఆత్మాభిమానంతో  గర్భిణి సాహసం- భర్తపై కోపంతో 65 కిలోమీటర్లు నడిచి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Nellore Anil Warning : అమ్మలక్కలు తిట్టిస్తా - టీడీపీ నేతలకు మాజీ మంత్రి అనిల్ హెచ్చరిక !

Nellore Anil Warning :  అమ్మలక్కలు తిట్టిస్తా - టీడీపీ నేతలకు మాజీ మంత్రి అనిల్ హెచ్చరిక !

Nellore Leaders In Rajya Sabha: రాజ్యసభ సభ్యత్వాల్లో నెల్లూరుకి లక్కీ ఛాన్స్ 

Nellore Leaders In Rajya Sabha: రాజ్యసభ సభ్యత్వాల్లో నెల్లూరుకి లక్కీ ఛాన్స్ 

Nellore News : తప్పుడు రాతలు రాస్తే నా అభిమానులు ఏదైనా చెయ్యొచ్చు, యూట్యూబ్ ఛానళ్లకు మాజీ మంత్రి అనిల్ కుమార్ వార్నింగ్

Nellore News : తప్పుడు రాతలు రాస్తే నా అభిమానులు ఏదైనా చెయ్యొచ్చు, యూట్యూబ్ ఛానళ్లకు మాజీ మంత్రి అనిల్ కుమార్ వార్నింగ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!