Chodavaram Sub Jail: సుత్తితో జైలర్‌పై దాడి - చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ - - సీసీటీవీ దృశ్యాలు చూస్తే షాక్ ఖాయం
Prision Escape: చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలర్‌పై సుత్తితో దాడి చేశారు. సీసీ ఫుటేజీ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

Two prisoners escape from Chodavaram sub jail: అనకాపల్లి జిల్లాలోని చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో హెడ్‌వార్డర్‌పై సుత్తితో దాడి చేశారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చోడవరం సబ్‌జైలులో వంట పనుల కోసం ఖైదీలను బయటకు తీసుకువచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాడుగుల చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బెజవాడ రాము, హెడ్‌వార్డర్ రాజుపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హెడ్‌వార్డర్ తలకు గాయమైంది, దీంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి అనంతరం, బెజవాడ రాము హెడ్‌వార్డర్ వద్ద ఉన్న తాళాల గుత్తిని లాక్కొని, జైలు ప్రధాన ద్వారం లాక్‌ను తెరిచి పరారయ్యాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఫించను డబ్బు కాజేసిన కేసులో రిమాండ్‌లో ఉన్న మరో ఖైదీ, పంచాయతీ మాజీ కార్యదర్శి నక్కా రవికుమార్ కూడా జైలు నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై స్పందించిన అనకాపల్లి జిల్లా పోలీసులు, పరారైన ఖైదీల కోసం విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, ఖైదీల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఘటన జైలు భద్రతా వ్యవస్థలలో లోపాలను బయటపెట్టిందని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh Anakapalli: Two remand prisoners, Ravikumar & Bezawada Ramu, escaped from Chodavaram Sub-Jail after attacking a head warder with a hammer & stealing keys. Ravikumar faces pension fraud charges, Ramu theft charges. Police teams launched a massive manhunt. pic.twitter.com/ZDbc1KkCpn
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) September 5, 2025
చోడవరం సబ్‌జైలు రిమాండ్ జైలుగా పనిచేస్తుంది, ఇక్కడ సాధారణంగా చిన్న నేరాలకు సంబంధించిన ఖైదీలను ఉంచుతారు. ఇలా పారిపోయి.. ఎన్ని రోజులు బయట ఉంటారని.. ఇవాళో రేపో పోలీసులకు దొరుకుతారని.. తర్వాత వారి పరిస్థితేమిటన్న సందేహాన్ని ఈ దృశ్యాలు చూసిన పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
Need to strengthen security in Jails. Two remands prisoners escaped from Chidavaram Sub Jail of Anakapalli district( Andhra Pradesh) - authorities are trying to nab them . pic.twitter.com/MDh32nGOX1
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) September 5, 2025





















