Nagarkurnool Kids Murder: చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!
Murderer Father: పిల్లల్ని గట్టిగా కొట్టాలంటేనే తండ్రులు సంశయిస్తారు. ఎంత తప్పు చేసినా కొట్టరు.కానీ ఈ తండ్రి వారిని చంపి..పెట్రోల్ పోసి కాల్చేశాడు.

Father kills three children: పిల్లలకు భయం చెప్పడానికి తల్లి కోపగించుకుంటుందేమో కానీ.. తండ్రి మాత్రం తప్పు చేసినా వెనకేసుకొస్తాడు.కానీ ఈ తండ్రి మాత్రం కర్కోటకుడు. ఎంత అంటే.. మాభం శుభం తెలియని చిన్న పిల్లల్ని చంపేసి.. పెట్రోల్ పోసి కాల్చేశాడు. మొత్తం ముగ్గుర్ని ఇలా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెపగిలే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
భార్యతో గొడవపడి పిల్లలతో బ యటకు వచ్చిన తండ్రి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత నెల 30వ తేదీన భార్యతో గొడవపడ్డాడు. తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వచ్చేశారు. ఆ ముగ్గురు చిన్న పిల్లరు. మోక్షితకు ఎనిమిదేళ్లు, రఘువర్షిణికి ఆరేళ్లు, శివధర్మకు నాలుగేళ్లు. మూడు రోజులైనా కనిపించకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
శ్రీశైలం మీదుగా నాగర్ కర్నూలు రాక - అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్య
నాగర్ కర్నూలులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయినట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఆయన స్థానికుడు కాదు. దాంతో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు. ప్రకాశం జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసు.. బైక్ నెంబర్ ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నది గుత్తా వెంకటేశ్వర్లు అని గుర్తించారు. కుటుంబసభ్యులు వచ్చారు. అయితే పిల్లల ఆచూకీ కనిపించలేదు. దాంతో పోలీసులు గుత్తా వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా నుంచి నాగర్ కర్నూలు ఎలా వచ్చాడో .. ఆ దారిలో సీసీ సీసీ కెమెరాలు వెదికారు. కొన్ని చోట్ల్ల ముగ్గురు పిల్లలు.. కొన్ని చోట్ల ఒక్క పాపతో కనిపించాడు.
పిల్లలను వేర్వేరు చోట్ల చంపేసి పెట్రోల్ పోసి కాల్చిన తండ్రి
దాంతో పోలీసులు అనుమానాస్పద ప్రాంతాల్లో వెదికారు. ఓ చోట ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ తో కాల్చిన ఆనవాళ్లు..మరో చోట మరో పాపను అలాగే కాల్చేసిన ఆనవాళ్లు లభించాయి. అంటే తన బిడ్డల్ని చంపేసి ఘోరంగా పెట్రోల్ తో కాల్చేసి తానుపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ తండ్రి చేసిన పనికి దిగ్భ్రాంతికి గురైన సమాజం
పసిపిల్లలను తన చేతులతో చంపాలని ఎందుకు అనుకున్నాడో.. కానీ చనిపోవాలనుకుంటే..తాను చనిపోవచ్చని..ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల్ని ఎందుకు చంపేశాడోనని కొంత మంది ఆవేదన చెందుతున్నారు. ఈ దారుణ సంఘటన స్థానిక సమాజంలో షాక్‌ను కలిగించింది. దాంపత్య కలహాలు ఇంత దారుణమైన ఫలితాలకు దారితీయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.





















