Man shoots wife: బిజీ మార్కెట్‌లో భార్యను కాల్చి చంపేశాడు - కానీ పారిపోలేదు అక్కడే ఉన్నాడు - ఏం చేశాడంటే ?
Gorakhpur Crime: భార్య తీవ్రంగా వేధించిందని ఆ భర్త తుపాకీతో కాల్చిచంపాడు. పోలీసులు వచ్చే వరకూ అక్కడే ఉన్నాడు. ఆమె పెట్టిన బాధల గురించి వారికి చెప్పుకున్నాడు.

Man shoots wife dead in busy market in Gorakhpur: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ షాపూర్ ప్రాంతంలోని జైల్ రోడ్డులో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. విశ్వకర్మా చౌహాన్ అనే వ్యక్తి తన భార్య మమతా చౌహాన్‌ను (30) రద్దీగా ఉన్న మార్కెట్‌లో కాల్చి చంపాడు. ఈ సంఘటన తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు అక్కడే ని ఉండిపోయాడు. పిచ్చి పట్టిన వ్యక్తిలా "ఆమె వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను" అని అడిగినా అడగకపోయినా అందరికీ పదేపదే చెప్పాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మమతా చౌహాన్ అనే మహిళ ఫోటో స్టూడియోలో తన ఫోటో తీయించుకునేందుకు వెళ్లింది. ఆమె స్టూడియో నుండి బయటకు రాగానే, అక్కడే బైక్‌పై వేచి ఉన్న విశ్వకర్మా చౌహాన్‌తో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్రమైన గొడవగా మారడంతో, విశ్వకర్మా తన హెల్మెట్‌లో దాచిన పిస్టల్‌తో మమతాపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె ఛాతీలో, మరొకటి ఆమె చేతిలో తగిలింది. మమతా అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెను చనిపోయినట్లు ప్రకటించారు.
విశ్వకర్మా , మమతా చౌహాన్‌లకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 13 ఏళ్ల కుమార్తె ఉంది, ఆమె తల్లితో కలిసి షాపూర్‌లోని గీతా వాటికా సమీపంలో అద్దె గదిలో నివసిస్తోంది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ దంపతుల మధ్య దాంపత్య కలహాలు కొనసాగుతున్నాయి, దీని కారణంగా వారు విడిగా నివసిస్తున్నారు. మమతా ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. విశ్వకర్మను అదుపులోకి తీసుకున్నా పోలీసులు విచారణ జరుపుతున్నారు. విశ్వకరమా సంఘటనా స్థలంలోనే ఉండిపోవడం వల్ల పోలీసులు అతన్ని సులభంగా అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసులో ఆస్తి వివాదం సహా ఇతర కోణాలను కూడా పరిశీలిస్తున్నారు.
गोरखपुर में दिल दहला देने वाली वारदात — आपसी विवाद में पति ने बीच सड़क पर पत्नी को गोली मार दी। 13 वर्षीय बेटी की आंखों के सामने हुई निर्मम हत्या। आरोपी मौके से गिरफ्तार।#GorakhpurNews #CrimeNews #UPCrime #HorrorOnStreet #DomesticViolence #BreakingNews #JusticeForMamta… pic.twitter.com/Qppr8KgYrf
— GBN Today (@GBNToday) September 4, 2025
ఈ ఘటన స్థానికులలో భయాందోళనలను రేకెత్తించింది. రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇటువంటి హింసాత్మక సంఘటన జరగడం అరుదు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. తల్లి చనిపోవడం..తండ్రి జైలు పాలుకావడంతో ఆ కుమార్తె అనాథగా మారింది.





















