TTD Brahmostavas 2021: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఏ తేదీల్లో ఏ వాహన సేవలంటే...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వాహనసేవల వివరాలను టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 7న ధ్వజారోహణంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు 15వ తేదీతో ముగుస్తాయి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహనసేవల వివరాలను టీటీడీ ప్రకటించింది.
Also Read: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
- 06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు)
- 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)
- 08-10-2021: చిన్నశేష వాహనసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)
- 09-10-2021: సింహ వాహనసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహనసేవ(సాయంత్రం)
- 10-10-2021: కల్పవృక్ష వాహనసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)
- 11-10-2021: మోహినీ అవతారం(ఉదయం)- గరుడ వాహనసేవ(సాయంత్రం)
- 12-10-2021: హనుమంత వాహనసేవ(ఉదయం)- గజ వాహనసేవ(సాయంత్రం)
- 13-10-2021: సూర్యప్రభ వాహనసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహనసేవ(సాయంత్రం)
- 14-10-2021: రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహనసేవ(సాయంత్రం)
- 15-10-2021: పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు వచ్చిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. 26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేస్తామని తెలిపారు.
Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ