News
News
X

Tirumala Brahmotsavas 2021: అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు.. ఆ జిల్లాల భక్తులకు గుడ్ న్యూస్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు.

FOLLOW US: 
 
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌ అన్నమ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో స‌మీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాల 9 రోజుల్లో టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన జిల్లాల్లోని వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు చెందిన 500 నుండి 1000 మంది భ‌క్తుల‌ను బ‌స్సుల్లో ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకొచ్చి స్వామివారి ద‌ర్శనం చేయించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో ఎస్వీబీసీ క‌న్నడ‌, హిందీ ఛాన‌ళ్లు ప్రారంభించేందుకు సీఈవో ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యంపై వ‌సంత మండ‌పంలో ప్రముఖ పండితుల చేత ఉప‌న్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. 

Also Read: TTD: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం

త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజినీరింగ్ ప‌నులు త్వర‌గా పూర్తి చేయాల‌ని ఈవో జవహర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని బ్రహ్మోత్సవాల లోపు భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మ‌ర‌మ్మతులు పూర్తయిన కాటేజీల‌ను భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాల‌ని సూచించారు. వాహ‌నసేవలు జ‌రిగే ప్రాంత‌మైన క‌ల్యాణ‌మండ‌పంలో చిన్న బ్రహ్మర‌థం ఏర్పాటు చేయాల‌న్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలన్నారు.

News Reels

విద్యుత్ అలంకరణలు

బ్రహ్మోత్సవాల రోజుల్లో భ‌క్తుల‌కు, వీఐపీల‌కు ఇబ్బందులు లేకుండా భ‌ద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమ‌బ‌ద్ధీక‌ర‌ణకు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని భద్రతా విభాగం, పోలీసు అధికారులకు సూచించారు. శ్రీ‌వారి ఆల‌యం, అన్ని కూడ‌ళ్లలు, ముఖ్యమైన ప్రాంతాల్లో శోభాయ‌మానంగా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శనం, ల‌డ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులకు సూచించారు. అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని డిప్యూటీ ఈవోను ఆదేశించారు. వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు ప‌రిమిత సంఖ్యలో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు.

Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్‌

ముఖ్యమంత్రికి ఆహ్వానం

అంతకుముందు టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ఏవీ.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ అక్టోబ‌రు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, అక్టోబ‌రు 6న అంకురార్పణ జ‌రుగుతాయ‌ని, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబ‌రు 7న ధ్వజారోహ‌ణం, అక్టోబ‌రు 11న గ‌రుడ‌వాహ‌న‌సేవ‌, అక్టోబ‌రు 12న స్వర్ణర‌థం(స‌ర్వభూపాల వాహ‌నం), అక్టోబ‌రు 14న ర‌థోత్సవం(స‌ర్వభూపాల వాహ‌నం), అక్టోబ‌రు 15న చ‌క్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ప్రతి ఏడాది లాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తామని చెప్పారు.

Also Read: TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Sep 2021 07:18 PM (IST) Tags: AP News Tirumala news Tirumala brahmostavas 2021 srivari brahmostavas 2021

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: తెలంగాణపై సమైక్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు -గుత్తా సంచలనం

Breaking News Live Telugu Updates: తెలంగాణపై సమైక్యవాదుల కుట్ర, కేసీఆర్‌ను అడ్డు తొలగించాలని పన్నాగాలు -గుత్తా సంచలనం

కడప-రేణిగుంట హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్- రెండేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్

కడప-రేణిగుంట హైవే విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్- రెండేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్

Tirumala News: శ్రీవారి దర్శనానికి ఒక రోజు సమయం, నిన్నటి హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala News: శ్రీవారి దర్శనానికి ఒక రోజు సమయం, నిన్నటి హుండీ ఆదాయం ఎంతంటే?

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Weather Latest Update: బంగాళాఖాతంలో త్వరలో తుపాను! ఏపీపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD అధికారులు ఏం చెప్పారంటే

Weather Latest Update: బంగాళాఖాతంలో త్వరలో తుపాను! ఏపీపై ఎఫెక్ట్ ఉంటుందా? IMD అధికారులు ఏం చెప్పారంటే

టాప్ స్టోరీస్

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

Center on FM Radio Channels: రేడియోలో అలాంటి పాటలు ప్రసారం చేస్తే ఊరుకోం, కేంద్రం హెచ్చరికలు

Center on FM Radio Channels: రేడియోలో అలాంటి పాటలు ప్రసారం చేస్తే ఊరుకోం, కేంద్రం హెచ్చరికలు