By: ABP Desam | Updated at : 17 Sep 2021 11:21 AM (IST)
తిరుమల ఆలయం (ఫైల్ ఫోటో)
అక్టోబర్ నెలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాబోయే రెండు మూడు నెలల్లో కోవిడ్ తీవ్ర రూపంలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే నేడు పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నమని చెప్పారు. మరో వారంలో ఆన్లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సర్వర్లు డేటా స్పీడ్ అందుకోలేక పోతున్నాయని పేర్కొన్నారు. జియో కంపెనీ వాళ్లతో సంప్రదింపులు చేశామని.. త్వరలోనే సర్వదర్శన టోకెన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.
టీటీడీ బోర్డును రద్దు చేయండి.. ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నూతన పాలమండలి ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిరుమల శ్రీ వెంటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. భక్తల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. వ్యాపార ధోరణితో టీటీడీ బోర్డులో ఏకంగా 81 మందిని నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. టీటీడీని రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని తెలిపారు. టీటీడీ బోర్డులో అవినీతిపరులు, నేర చరిత్ర కలిగిన వారికి స్థానం కల్పించడాన్ని తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు అయిన జంబో బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని స్థానంలో నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇటీవలే తిరుమల నూతన పాలకమండలి నియామకం..
టీటీడీ పాలక మండలిలో 24 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గత పాలకమండలిలో 8 మందిగా ఉన్న ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను ఈసారి ఏకంగా 50కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బోర్డులో మాత్రం గతంలో మాదిరిగానే మొత్తం 25 మంది సభ్యులే కొనసాగనున్నారు. గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా 2019లో పాలక మండలి సభ్యుల సంఖ్యను 18 నుంచి ఏకంగా 37కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను ఏకంగా 81కి పెంచింది.
Also Read: TTD Board : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !
AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియర్ ఆఫీస్లపై పోలీసుల నిఘా
Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్
Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్ కోటాలో 90% బుక్!
Aadhi-Nikki Marriage Photos: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన ఆది, నిక్కీ