PM Modi Birthday: ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ... 71వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ.. ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ప్రధాని మోదీ పుట్టిన రోజు నేడు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ట్విట్టర్ వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ప్రధానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ట్విటర్‌లో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, దేశ ప్రజలకు సేవలందించాలని కోరుకున్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
ప్రధాని మోదీకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ప్రధాని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తూ దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
भारत के प्रधानमंत्री श्री @narendramodi को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। मेरी शुभेच्छा है कि आप स्वस्थ रहें और दीर्घायु प्राप्त कर ‘अहर्निशं सेवामहे’ की अपनी सर्वविदित भावना के साथ राष्ट्र सेवा का कार्य करते रहें।
— President of India (@rashtrapatibhvn) September 17, 2021
My best wishes to Hon'ble Prime Minister, Shri Narendra Bhai Modi ji on his birthday today. His exceptional vision, exemplary leadership and dedicated service have led to all-round growth of the nation. May he be blessed with a long, healthy and happy life ahead! @narendramodi
— Vice President of India (@VPSecretariat) September 17, 2021">
ప్రధాని నరేంద్రమోదీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ దృక్పథం, ఆదర్శవంతమైన నాయకత్వం, అంకితభావంతో ప్రధాని చేస్తున్న సేవతో ఈ దేశం నలుదిశలా అభివృద్ధి చెందుతోందన్నారు.
హ్యాపీ బర్త్‌డే మోదీ జీ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Happy birthday, Modi ji.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2021
తెలంగాణ, ఏపీ గవర్నర్లు శుభాకాంక్షలు
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోదీకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ట్వీట్ చేశారు.
Happy Birth Day to Visionary leader who made Self reliant India:Reformative India :Resilient India:Resurgent India:Glorious India :Super strong leader who Made Mother India Proud Globally pic.twitter.com/KYLgRq6KCw
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 16, 2021
I along with the people of Andhra Pradesh, with pleasure and privilege convey our heartiest felicitations and warm greetings to you on your Birthday. @narendramodi @PMOIndia pic.twitter.com/VFDhmebBwn
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) September 17, 2021
మోదీ గొప్ప దార్శనికుడు-పవన్ కల్యాణ్
ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, దేశానికి మోదీ లాంటి దృఢ సంకల్పం కలిగిన నాయకుడు అవసరమని ఆయన అన్నారు. భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం కత్తి మీద సాము లాంటిదేనన్న పవన్.. ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదేనని అభిప్రాయపడ్డారు. ఆ స్థానంలో నిలిచిన మోదీని.. తాను గొప్ప దార్శనికునిగా భావిస్తానన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా శ్రీ మోదీ గారితో కలసి అనేక సభలలో ప్రచారంలో చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది. pic.twitter.com/BPrenDyRq3
— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021