By: ABP Desam | Updated at : 16 Sep 2021 01:47 PM (IST)
టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు ఏం చేస్తారు ?
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్‌తో కలిపి ఉన్న 25 మంది బోర్డుపైనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ పునరావాసంగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా టీటీడీ పాలక మండలిలో 50మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. ఈ 50 మంది పాలక మండలిలో ఏం చేస్తారు..? వారికి ఉన్న అధికారాలేమిటి..? అసలు ఎందుకు వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చాల్సి వచ్చింది ? అన్న సందేహాలకు ఎవరి దగ్గరా సమాధానాలు ఉండవు.
12 నుంచి 75కి చేరిన పాలకమండలి సభ్యుల సంఖ్య !
ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయానికి రోజుకు లక్ష మంది వరకూ భక్తులు వస్తూంటారు. అపర కుబేరులు కూడా శ్రీవారి దర్శనం కోసం వస్తూంటారు. టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉంటే ఆ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో రాజకీయనేతలు, బడా పారిశ్రామికవేత్తలందరికీ తెలుసు. అందుకే టీటీడీ బోర్డులో సభ్యులవ్వాలని తహతహలాడుతూంటారు. ప్రభుత్వాలను కాకాపట్టి సాధిస్తూ ఉంటారు. అయితే అన్ని ప్రభుత్వాలూ శ్రీవారికి.. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలకు గౌరవం ఇచ్చాయి. పదవులు ఇవ్వడానికే టీటీడీ బోర్డును భర్తీ చేసే ప్రయత్నం చేయలేదు. గతంలో 12మందితోనే పాలక మండలి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. Also Read : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..?
ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 50మందికి పాలకమండలి సభ్యుల హోదా !
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలక మండలిని పాతిక మందికి చేర్చారు. ఇప్పుడు కొత్తగా యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. వీరిలో ఎవరూ హిందూత్వానికి సేవ చేసిన వారు లేరు. శ్రీవారి భక్తులకు మేలు చేయాలనో.. సేవ చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టిన వారు కూడా లేరు. ఉన్నదల్లా ప్రభుత్వం వద్ద పలుకుబడి మాత్రమే. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్దలు, కేంద్రమంత్రులు సిఫార్సు చేసిన వారందర్నీ కాదనకుండా ప్రత్యేక ఆహ్వానితుల కేటగిరిలో చేర్చేశారు. అయితే వారెవరికీ ప్రత్యేకమైన ఓటింగ్ హక్కులు ఉండవని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కానీ సభ్యుల మాదిరిగానే వారికి దర్శనాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. Also Read : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !
ప్రత్యేక ఆహ్వానితులు భక్తుల ప్రయోజనాలను కాపాడతారా..? దెబ్బతీస్తారా ?
టీటీడీ పాలక మండలి సభ్యుడికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. వాటిలో ఒకటి ప్రతీ రోజూ రెండు వందల టిక్కెట్లను కేటాయించడం. ఇది అధికారికమో..అనధికారికమో స్పష్టత లేదు కానీ సంప్రదాయంగా వస్తోంది. అలాగే సభ్యులకు ఎప్పుడు సమావేశాలకు వచ్చినా .. దర్శనం కోసం వచ్చినా టీటీడీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనాలు ఏర్పాటు చేయడం .. బస దగ్గర్నుంచి వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తారు. దాని వల్ల భక్తుల సొమ్ము చాలా వరకూ వారికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గతంలో సభ్యులు కొంత మంది ఉన్నప్పుడే పాలక మండలి సభ్యుల పేర్లతో లెటర్ ప్యాడ్లు దుర్వినియోగం అయ్యేవి. తీవ్రమైన ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు వారి సంఖ్య విపరీతంగా ఉంది. పైగా రాజకీయ అవసరాల కోసం నియమితులైన వారు ఎక్కువగా ఉన్నారు. వారి వల్ల టీటీడీ బోర్డుకు కానీ.. భక్తులకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ భక్తుల డబ్బులు మాత్రం వారి కోసం వెచ్చించాల్సి రావడం మాత్రం తప్పనిసరి. Also Read : ఏపీలో నేరాల విప్లవం - తెలంగాణలో సైబర్ క్రైమ్ హవా ! వెలుగులోకి కీలకమైన నేర గణాంకాలు !
శ్రీవారిని భక్తులకు దూరం చేస్తే ప్రభుత్వానికే ఇబ్బంది !
పాలకమండలి సభ్యుల వల్ల భక్తులకు ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు ఉన్న 75 మంది సభ్యులకు రోజుకు రెండువందల టిక్కెట్లు కేటాయిస్తే ఇక సామాన్యులకు దక్కే దర్శనాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. వారందరూ తమ పలుకుబడిని ఉపయోగించుకుని ఆర్జిత సేవల టిక్కెట్లను కూడా పొందితే ఇక అలాంటి సేవలు సామాన్య భక్తులకు దక్కడం దుర్లభమే అవుతుంది. ఈ జంబో టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బయటపడతాయి. భక్తులను ఇబ్బంది పెడితే అది ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?