AP High Court : ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కోర్టు ధిక్కరణే కారణం !
సెరీకల్చర్ ఉద్యోగ నియామకాల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అదే పనిగా ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. 29న ఎంతకాలం శిక్ష అనేది ఖరారు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్ని సార్లు ఆదేశించినా హైకోర్టు ఉత్తర్వులను చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు చివరికి శిక్ష విధించింది. హైకోర్టు తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, పూనం మాలకొండయ్యలకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 29వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం హర్టీకల్చర్ సెరీకల్చర్ కమిషనర్‌గా- చిరంజీవి చౌదరి ఉన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య ఉన్నారు. పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వారెంట్ జారీ చేశారు. Also Read : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన చుట్టూ రాజకీయం! న్యాయం ఎలా చేస్తారు ?
విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్దేశించిన పలు అర్హతలను తొలగించింది. దీన్ని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. Also Read : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న నేరాలు
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉద్దేశపూర్వకంగానే అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. ఈ కేసు విషయంపై గత జూన్ 22న గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు నెల రోజులు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆదేశాలు అమలు చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో మానవతా దృక్పథంతో ఆ తీర్పును సవరించింది. ఇద్దరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించి న్యాయస్థానం పనిగంటలు ముగిసేవరకు కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చినా కోర్టు తీర్పును అమలు చేయలేదు. Also Read : యాత్రలతో ప్రజల్లోకి టీడీపీ అగ్రనేతలు
చివరికి కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రధాన కారకులుగా హర్టీకల్చర్ సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యలుగా గుర్తించి శిక్ష విధించారు. 29న శిక్ష ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం అంగీకరించకపోతే తాము ఎలా ఉత్తర్వులు ఇస్తామని ఐఎఎస్ అధికారులు మథన పడుతున్నారు. 29లోపు ఉత్తర్వులు అమలు చేసి చెబితే శిక్షను రద్దు చేస్తారన్న ఆలోచనలో ఐఎస్ వర్గాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. Also Read : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ?