![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Deputy CM Caste Row : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ?
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి క్యాస్ట్ సర్టిఫికెట్‌పై మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివాదం ఉంది. ఆమె సోదరి ఎస్టీ కాదని ఉద్యోగం నుంచి తొలగించారు.ఈమె ఎలా ఎస్టీ అవుతారని ప్రశ్నలు వస్తున్నాయి.
![Deputy CM Caste Row : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ? Deputy CM cast certificate dispute before High Court Deputy CM Caste Row : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/14/c824feafc58de51058fcb2c6fd178d32_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవారి షెడ్యూల్ తెగలకు చెందిన వారేనని నిర్ధారించిన "అప్పీల్ అథార్టీ" విచారణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ మేరకు విచారణకు సంబంధించి వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పుష్పశ్రీవాణి క్యాస్ట్ సర్టిఫికెట్ వివాదం సుదీర్ఘ కాలంగా సాగుతోంది. విజయనగరం జిల్లా ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి వరుసగా గెలుస్తున్న ఆమె ఎస్టీ కాదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడే ఈ వివాదం ప్రారంభమయింది. కొన్ని సాక్ష్యాలతో కొంత మంది కోర్టును ఆశ్రయించారు. రెండో సారి పోటీకి నామినేషన్ దాఖలు చేసినప్పుడు పుష్పశ్రీవాణి అందజేసిన కులధ్రువీకరణ పత్రం అర్హతను ప్రశ్నిస్తూ ఇతర పోటీ దారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఆమె ఎస్టీ కాదని కోర్టు తీర్పు చెప్పలేదు కాబట్టి రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను అంగీకరించారు.Also Read : జనవరి 26 నుంచి ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ సేవలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
పాముల పుష్పశ్రీవాణి కురుపాంకు చెందిన వారు కాదు.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు. ఆ జిల్లాలో కొండ దొర తెగలకు చెందినవారు. ఆ తెగల వారు విధిగా ఆర్టీవో స్థాయి అధికారి నుంచి కులధ్రువీకరణ పత్రం పొందాలనే నిబంధనలు ఉన్నాయి. పాముల పుష్ప శ్రీవాణి సోదరి పాముల రామతులసి పశ్చిమగోదావరి జిల్లా కోట సీతారాంపురం ఐటీడీఏలో ఎస్టీ కోటాలో కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆమె నిజమైన ఎస్టీ కాదని కొందరు అక్కడి ఐటీడీఏ పీవోకు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. ఆ మేరకు విచారణ జరిపిన అధికారులు రామతులసి ఎస్టీ తెగలకు చెందిన వారు కాదని నిర్ధారించారు. ఎంపికైన ఉపాధ్యాయ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ
సోదరి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి మాత్రం ఎస్టీ ఎలా అవుతుందని రేగు మహేశ్వరరావు అనే వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కలెక్టర్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీకి పంపించారు. ఆ కమిటీ పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చి మే 9న ఉత్తర్వులిచ్చింది. అయితే గిరిజన మంత్రి ఉన్న పుష్పశ్రీవాణికి అనుకూలంగా ఆ శాఖనే ఎలా తీర్పు ఇస్తుందని పిటిషనర్ ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసారు. చట్టప్రకారం అప్పీల్ విచారణ పరిధి గిరిజన శాఖ మంత్రికి ఉంటుందని... కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్‌పై ఆమే విచారణ చేయడం చట్టానికి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?
అధికారులు విచారణ పత్రాలు అన్నీ సమర్పిస్తే వచ్చే వారు హైకోర్టు ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులపై ఇలాంటి కులధృవీకరణ పత్రాల వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. కొంత మంది గెలిచిన తర్వాత ఎస్టీ కాదని తేలడంతో పదవులు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
Also Read : టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ నుంచి పిలుపు... ఈ నెల 20న చిరంజీవి బృందం భేటీ...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)