Amaravati Constructions : అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయా ? అప్పు కోసమా ? నిజంగానే పూర్తి చేస్తారా ?
అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. పలు భవనాల్లో కార్మికులు కనిపిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను మళ్లీ ప్రారంభించింది. రెండున్నరేళ్ల క్రితం ఎక్కడివక్కడ ఆగిపోయిన పనులు .. మళ్లీ జరగలేదు. షాపూర్జీ పల్లోంజి, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ వంటి బండా సంస్థలు అక్కడ పనులు చేపట్టాయి. ప్రభుత్వం అమరావతిలో పనులేమీ చేయకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో ఆయా సంస్థలన్నీ తమ నిర్మాణ సామాగ్రిని, పెద్ద పెద్ద యంత్రాలను ఇతర కాంట్రాక్ట్ ప్రాంతాలకు తరలించేశాయి. నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇసుక, స్టీల్ ఇతర నిర్మాణ సామాగ్రి చాలా వరకు తుప్పుపట్టిపోయింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. వారం రోజుల నుంచి 70 శాతం పూర్తయిన భవనాల్లో నిర్మాణ కార్మికులు కనిపిస్తున్నారు. కొన్ని పనులు చేస్తున్నారు.
Also Read: వరి వద్దు.. రొయ్యల సాగు చేయండి ..రైతులకు ధర్మాన సలహా !
అమరావతిలో 70శాతానికిపైగా పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ అధికారులు, నాలుగోతరగతి ఉద్యోగులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం. ఇవన్నీ 55 నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు బంగ్లాల నిర్మాణాలు 30శాతం పూర్తయ్యాయి. ప్రధాన రహదారులు, వంతెరను.. దాదాపుగా యాభై శాతం పూర్తయ్యాయి. కొండవీటివాగు వల్ల రాజధానికి వరద ముంపు ఉంటుందనే భావనతో ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిపోయిన భవనాలను పూర్తి చేస్తే అమరావతిలో చాలా వరకు నివాస ప్రాంతాలు.. అధికారులకు కావాల్సిన వసతి అందుబాటులోకి వస్తుంది.
అమరావతి నిర్మాణాల పునంప్రారంభంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి బొత్స ప్రకటించారు. అయితే పెండింగ్ బిల్లులు ఉన్నందున కాంట్రాక్ట్ సంస్థలు... బిల్లులు చెల్లించిన తర్వాతనే పనులు చేస్తామని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో అప్పులు తెచ్చుకుని వారికి బిల్లులు చెల్లించి పనులు చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు పాత కాంట్రాక్టర్లే ఈ భవనాల పనులు చేస్తున్నారా.. లేకపోతే రివర్స్ టెండరింగ్‌లో ఇతరులకు ఇచ్చారా అన్నది ప్రభుత్వం చెబితేనే తెలుస్తుంది.
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్...
ఇటీవల మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మళ్లీ బిల్లు తెస్తామని వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు చెబుతున్నారు. దీంతో అమరావతిని అభివృద్ది చేయరేమోనని ప్రజలు భావిస్తూ వస్తున్నారు. అయితే ఓ వైపు పనులు ప్రారంభించడమే కాదు..మరో వైపు దాదాపుగారూ. మూడు వేల కోట్లను అమరావతి భూములు అమ్మి అప్పులుగా తేవడానికి డీపీఆర్‌లు రెడీ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అప్పుల కోసమే ఇలా చేస్తున్నారని.. అప్పు మంజూరైన తర్వాత మళ్లీ పనులు ఆపేస్తారని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి