Dharmana : వరి వద్దు.. రొయ్యల సాగు చేయండి ..రైతులకు ధర్మాన సలహా !
వరికి బదులుగా రొయ్యల చెరువులు చేసుకోవాలని ఎమ్మెల్యే ధర్మాన రైతులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వరి సాగు చేస్తే రైతులకు లాభాలు రావడం లేదని .. ప్రభుత్వం ఎంత సాయం చేసినా వారి కష్టం తీరడం లేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. వరి రైతుల కష్టం తీరాలంటే ఏం చేయాలో కూడా ఆయన సలహా ఇచ్చారు. వరి సాగు చేసే రైతులు... రొయ్యల సాగుపై దృష్టి సారించాలన్నారు. తమ పొలాల్లో రొయ్యల చెరువులు తవ్వడానికి అవకాశం ఉంటే.. ఆ దిశగా అడుగులు వేయాలని ధర్మాన సూచించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని అన్నారు. గతంలో మత్స్యకారప్రాంతాలను అబివృద్ది చేయకుండా తప్పుచేశామని ధర్మాన ప్రసాదరావు అంగీకరించారు.
Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !
శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. తలసరి ఆదాయం పెరగటానికి , మన తలరాత మార్చడానికి ఆక్వారంగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు ధర్మాన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అందుకే నిధులకు ఇబ్బందికరంగా ఉందని ఆయన సంజాయిషీ ఇచ్చారు. మాట ఇచ్చాం కనుక పెద్ద ఎత్తున నిధులు అవసరం.. కష్టమైనా సంక్షేమం కొనసాగిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లనే కరోనా కాలంలోనూ ప్రజల ఆకలి కేకలు వినపడలేదని.. ఈ విషయంలో ప్రభుత్వం తప్పు ఏమీ చేయటం లేదన్నారు. ఇక అభివృద్ధి పనులపై విమర్శలు చేస్తున్నారని... కాలవలు , రోడ్లు అభివృద్దికి వచ్చే రెండేళ్లలో ముందుకు వెళదామని ధర్మాన ప్రసాదరావు సర్ది చెప్పారు.
Also Read: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
బోర్ల కింద వరి వేయవద్దని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రైతులను కోరింది. ఇప్పటికే చేతికి వచ్చిన పంటను ఆర్బీకేల్లో కొనుగోలు చేయడం లేదని రైతులు పలు చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా రైతులు వరిపంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని చూస్తున్నారు. ఈ సమయంలో ధర్మాన ప్రభుత్వ సూచనను సమర్థిస్తూ వరి వేయడం వేస్ట్ అని రొయ్యల చెరువులుగా మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలు సూచించాలి కానీ.. వరి పొలాల్ని రొయ్యల చెరువులుగా మార్చాలని సలహా ఇవ్వడం ఏమిటన్న విమర్శలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి