Sujana : saveandhrapradesh2022@gmail.com... ఇది ఉత్త మెయిల్ కాదు.. ఎంపీ సుజనాచౌదరి ఏపీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం !
ఏపీలో వేధింపులకు గురవుతున్నవారికి అండగా ఉండేందుకు ఈ-మెయిల్ అందుబాటులోకి తెచ్చారు సుజనాచౌదరి. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వివరాలు తనకుపంపితే అండగా ఉంటానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల బెదిరింపులు, వేధింపులు పెరిగిపోతున్నాయని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలావేధింపులకు గురవుతున్న వారికి అండగా ఉంటాలని నిర్ణయించుకున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున బెదిరింపులు పెరిగిపోయాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీల పేర్లు చెప్పుకుని బదెరింపులకు దిగుతున్నారని.., ఇలాంటి వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఎవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. అసలు గొడవేంటి అన్న వివరాలను మెయిల్ చేయాలని కోరారు. ఆ మెయిల్ అడ్రస్ పేరు.. saveandhrapradesh2022@gmail.com.
విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఘటనలు అరాచకానికి పరాకాష్ట. అధికార పార్టీ నేతల పేర్లతో బెదిరింపులను సీఎంగారు తక్షణం అరికట్టాలి. బాధితులు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి, కాపీని నాకు పంపండి. మీకు అండగా ఉంటా.
— YS Chowdary (@yschowdary) December 20, 2021
మెయిల్ ఐడి saveandhrapradesh2022@gmail.com
తమకు ఎదురవుతున్న వేధింపులు.. బెదిరింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఈ మెయిల్ అడ్రస్‌కు .. వివరాలు పంపితే మిగతా విషయాలు తాను చూసుకుంటానని సుజనా చౌదరి చెబుతున్నారు. విశాఖలో హయగ్రీవ్ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు.. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేతపై దాడి వంటి విషయాలను సుజనా చౌదరి గుర్తు చేస్తున్నారు.
The incidents in which Mr Jagadeeswarudu of Vizag & Mr Subbarao Gupta of Ongole were at the receiving end of the rowdyism point to the height of lawlessness in Andhra Pradesh. Miscreants are routinely resorting to blackmail & threats in the name of bigwigs in govt.
— YS Chowdary (@yschowdary) December 21, 2021
Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం
టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి..., బీజేపీలో చేరారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉంటున్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని బీజేపీ నేతలు కూడా కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా తాను అండగా ఉంటానని చెప్పి ఈమెయిల్ అందుబాటులోకి తేవడం అంటే... అక్కడకు వచ్చే ప్రతి కేసు వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరుపై బీజేపీ ఎంపీలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్లుగా గతంలో ప్రకటించారు. ఇప్పుడు సుజనా చౌదరి తన దృష్టికి వచ్చే ఫిర్యాదుల వివరాలను కూడా ఢిల్లీ స్థాయిలో స్పందించేలా చేయగలిగితే.. ఆయన మెయిల్ బాక్స్ ఫిర్యాదులతో నిండిపోయే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి