అన్వేషించండి

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు

Andhra Pradesh News | తనపై జరిగిన కస్టడీయల్ హింసకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్య రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.

Raghu Rama Krishna Raju | అమరావతి: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబుకు సీనియర్ నేత రఘురామ కంప్లైంట్ చేశారు. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం  ఏర్పడిన వెంటనే, వైసీపీ ప్రభుత్వంలో జగన్ హయాంలో తనపై జరిగిన కస్టడీయల్ హింసపై చర్య తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఐపీఎస్‌లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సిఐడి అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి (గుంటూరు జీజీహెచ్)లపై రఘురామ ఫిర్యాదు చేయగా FIR నమోదు చేశారని తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ అధికారి విజయ పాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించారు. మరోవైపు పీవీ సునీల్ కుమార్ దర్యాప్తులో జోక్యం  చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడు తున్నారని రఘురామ పేర్కొన్నారు. కనుక ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదుపై స్పందించి తక్షణమే న్యాయం చేయాలని రఘురామ అభ్యర్థించారు.

మూడుసార్లు తనను లేపేయాలని చూశారన్న రఘురామ
‘గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. మాజీ సీఎం జగన్ కు మచ్చుకైనా మానవత్వం అంటూ లేదు. నన్ను దారుణంగా చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగకుండా మూడుసార్లు నన్ను పైకి పంపాలని చూశారు. అలాంటి జగన్ కు అప్పుడే మానవత్వం విలువ తెలిసొచ్చిందా. ఇంతకీ ఏం జరిగిందా. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నా, పటిష్టమైన భద్రత ఉన్నా ఎవరైనా తనను కాల్చివేస్తారేమోనని చెట్లు నరికించిన ఘనుడు జగన్. నాలుగన్నరేళ్లు నా నియోజకవర్గానికి సైతం రాకుండా నన్ను అడ్డుకున్నారు. ప్రధాని మోదీ వస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని చూస్తే ఆ ప్రయత్నం కూడా సఫలం కాకుండా చేశారు. 

Also Read: Tirumala Bramhosthavam: తిరుమలను ఆది వరాహక్షేత్రం అని ఎందుకు అంటారు.. అలా చేస్తేనే శ్రీవారి దర్శనంతో సత్ఫలితం!

జగన్ నువ్వు ఎమ్మెల్యేవు. నువ్వు తిరుమల దర్శనానికి వెళ్తే నీతో పాటు మరికొందర్ని అనుమతిస్తారు. కానీ వందలు, వేల మందితో కలిసి వెళ్లాలని ప్లాన్ చేయడం ఏంటి? గతంలో తీసివేసిన రూల్ ను టీటీడీ ఈవో శ్యామలరావు తిరిగి పునరుద్ధరించారు. ఇలా ప్రభుత్వాలు సైతం ఎన్నో పాత నిర్ణయాలను అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు రూల్ పాటించకుండా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. నెయ్యి కల్తీపై ఎన్‌డీడీబీ టెస్టులు జరిపి నిజమేనని తేల్చింది. దీనిపై సైతం వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. వేల ఆవుల పాలలో కల్తీ జరుగుతుందా? ఏఆర్ డెయిరీ పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్వామివారికి ఏ అపచారం జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లడ్డూ కల్తీ వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ త్వరలోనే నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించనుందని’ రఘురామ ఇటీవల కీలక విషయాలు ప్రస్తావించారు.

Also Read: LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget