అన్వేషించండి

LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు

Lulu Group: విశాఖపట్నంలో మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్‌ మార్కెట్లు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంపై చంద్రబాబు, లులు గ్రూప్ బృందం మధ్య చర్చలు జరిగాయి. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Chandrababu News: దుబాయ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ లులు(LULU ) గ్రూప్ ఇంటర్నేషనల్ తిరిగి ఏపీలో అడుగుపెట్టబోతుంది. 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విశాఖపట్నంలో తమ ప్రాజెక్టును నిలిపివేసింది లులు గ్రూప్. పెట్టుబడుల కోసం ఏపీని ఎప్పటికీ పరిగణించబోమని 2019 నవంబర్‌లో ప్రకటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు లులు గ్రూప్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తిరిగి ఏపీలో పెట్టుబుడులు పెట్టేందుకు రెడీ అయింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు, నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో లులు గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.   

చంద్రబాబుతో భేటీ
ఈ క్రమంలోనే లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ(yusuffali), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి వచ్చిన యూసుఫ్‌ అలీకి  సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. యూసుఫ్ అలీ కోర్ టీమ్ కూడా ఆయన వెంట ఉండవల్లికి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు లులూ గ్రూప్‌ బృందంతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, ప్రతిపాదనలపై లులు గ్రూప్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించింది. ఈ సందర్భంగా లులు గ్రూప్ రాష్ట్రంలోని మూడు ప్రదేశాల్లో  పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది.

చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన లులు గ్రూప్

‘లులు’ సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించినందుకు ఆ సంస్థ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయనతో శనివారం జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయని అన్నారు. విశాఖలో ఇంటర్నేషనల్ లెవల్ షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తామన్నారు. ‘‘ షాపింగ్‌ మాల్‌లో ఎనిమిది స్క్రీన్లతో ఐమాక్స్‌ మల్టీప్లెక్స్‌ నిర్మిస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్‌మార్ట్‌లు నిర్మిస్తాం. ఏపీలో ఆధునిక ఆహారశుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్‌ హబ్‌లు నిర్మిస్తాం’’ అని ఎక్స్‌ వేదికగా యూసఫ్ అలీ వెల్లడించారు.

మూడు చోట్ల బహుళ ప్రాజెక్టులు
విశాఖపట్నంలో మాల్, 8 స్క్రీన్లతో మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతి(Tirupati)లో హైపర్‌ మార్కెట్లు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంపై చంద్రబాబు, లులు గ్రూప్ బృందం మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ కూడా ఆసక్తి కనబరిచింది.  అయితే ఈ సందర్బంగా ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌తో పాటు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చంద్రబాబు(Chandrababu) వారికి లులు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూప్ ఆసక్తి చూపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కంపెనీల ఉనికి రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు, బ్రాండ్ బిల్డింగ్‌కు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు.  

ఎక్స్ లో ప్రకటన
‘‘లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ యూసుఫ్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీలకు ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు అమరావతిలో వారి ప్రతినిధి బృందంతో నేను చాలా ఉత్పాదకమైన సమావేశం నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతోపాటు వైజాగ్‌లోని మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్‌మార్కెట్, మల్టీప్లెక్స్‌ల ప్రణాళికలపై చర్చించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందజేస్తుంది. నా మిత్రుడు అతని ప్రయత్నాలలో మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఫలవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

పెట్టుబడులు విరమించుకున్న లులు గ్రూప్..
2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడుల కోసం లులూ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. లులు గ్రూప్ రూ. 2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, లగ్జరీ హోటల్‌ను స్థాపించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. అయితే 2019లో వైఎస్ జగన్(YS Jagan) నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. తమ భూకేటాయింపులను రద్దు చేసిందని ఆరోపిస్తూ ఒక భవిష్యతులో ఎప్పటికీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోమని లులు గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు  తిరిగి అధికారం చేపట్టడంతో లులు గ్రూప్ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది.  

Also Read: Nara Lokesh: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం అడుగులు - కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget