Nara Lokesh: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం అడుగులు - కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు, ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్
Andhra News: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది.
AP Government Established Consultative Forum: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed Of Doing Business) దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం (Consultative Forum) ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ పోరం పని చేయనుంది. రెండేళ్ల కాల పరిమితితో ఫోరం పని చేయనుండగా.. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది.
రాష్ట్రంలో పెట్టుబడులకు సంస్థల ఆసక్తి
I'm pleased to welcome the Chairman & MD of Lulu Group International, Mr @Yusuffali_MA, and the Executive Director, Mr Ashraf Ali MA, back to Andhra Pradesh. I had a very productive meeting with their delegation in Amaravati today. We discussed plans for a Mall and multiplex in… pic.twitter.com/itk1RuUIHX
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2024
అటు, రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, శనివారం లులు గ్రూప్స్ ఛైర్మన్ యూసఫ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ అప్పట్లో ఒప్పందం చేసుకుంది. అనంతరం వైసీపీ హయాంలో లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తాము తీసుకొస్తున్న నూతన పాలసీల గురించి లులు గ్రూప్ ఛైర్మన్‌కు వివరించారు. అనంతరం లులు గ్రూప్ చైర్మన్‌తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. కాగా, రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
Also Read: TTD : టీటీడీ కొత్త చైర్మన్ ఎంపిక పెద్ద టాస్క్ - రాజకీయేతరులకే చంద్రబాబు చాన్స్ ఇవ్వబోతున్నారా?